Allu arjun donates 25lakhs cheque to ap cm akhil condolance vv vinayak

allu arjun hudhud donations, allu arjun memu saitham performance, allu arjun meets chandrababu naidu, allu arjun movie updates, akkineni akhil consoles vv vinayak, akkineni akhil latest, akkineni akhil on vv vinayak mother death, akkineni akhil vv vinayak movie updates, tollywood latest news updates

allu arjun donates 25lakhs cheque to ap cm akhil condolance vv vinayak : Akhil has gone to Chagallu to console Vinayak and his family. allu arjun donates rupees 25lakhs cheque to chandrababu naidu for hudhud relief fund

ఒకరి సాయం.., మరొకరి పరామర్శ

Posted: 12/09/2014 10:40 AM IST
Allu arjun donates 25lakhs cheque to ap cm akhil condolance vv vinayak

టాలీవుడ్ హీరోలు ఇచ్చిన మాటలు, చేసిన ప్రకటనలను ఒక్కొక్కరుగా నెరవేరుస్తున్నారు. హుదూద్ తుఫాను బాధితుల కోసం ఇండస్ర్టీ అంతా సాయం చేసిన విషయం తెలసిందే. అందులో భాగంగా గతంలో ప్రకటించినట్లుగా అల్లు అర్జున్ రూ. 25లక్షల విలువైన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. హైదరాబాద్ లో సాయంత్రం బాబును కలిసిన బన్నీ.., చెక్కును అందించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్యకారులకు సాయం చేసేందుకు ఈ నిధులు ఉపయోగించాలని కోరగా అందుకు సీఎం అంగీకరించారు. సీఎంను కలసిన సమయంలో బన్నీ వెంట మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు.

అటు అక్కినేని అఖిల్ డైరెక్టర్ వి.వి వినాయక్ ను పరామర్శించారు. గత వారం వి.వి. తల్లి చనిపోయిన విషయం తెలిసిందే. చాగల్లులో ఉన్న వినాయక్ ను కలిసిన అఖిల్, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చనిపోవటానికి గల కారణాలు అడిగి తెలుసుకుని, చిన్నవాడైనా వినాయక్ కు ధైర్యం చెప్పారు. అన్ని కుదురుకున్నాకే సినిమా చేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ తొలి సినిమాను వి.వి. వినాయక్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే దుర్ఘటన జరగటంతో సినిమా పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akkineni akhil updates  allu arjun hudhud donations  tollywood updates  

Other Articles