Baahubali bulgeria schedule tamannaa enjoys

tamannaa in baahubali shooting, tamannaa bulgeria tour updates, baahubali bulgeria schedule updates, baahubali shooting photos, baahubali latest news updaetes, prabhas baahubali photos, anushka movie updates, rajamouli latest updates, baahubali cast and crew

baahubali bulgeria schedule tamannaa enjoys : tamannaa enjoying baahubali bulgeria shooting schedule with weather and new place locations, tamanna posting all of her bulgeria photos, updates in social media says she is enjoying bulgeria

అక్కడికి ఎప్పుడెళ్లావు అమ్మడూ..?

Posted: 12/08/2014 12:07 PM IST
Baahubali bulgeria schedule tamannaa enjoys

పరువమంతా పాలదనం నిండి ఉన్న పాపులర్ హీరోయిన్ తమన్నా.., ప్రస్తుతం చలిని బాగా ఎంజాయ్ చేస్తోంది. వణుకుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.., కొత్తదనంను ఆస్వాదిస్తున్నట్లు కామెంట్ చేస్తోంది. మొన్నటి వరకు చెన్నైలో షూటింగ్ చేసుకుంటున్న తము చెప్పా పెట్టకుండా ఫ్లైట్ ఎక్కేసి బల్గేరియా చేరుకుంది. అక్కడ జరుగుతున్న ‘బాహుబలి’ షూటింగ్ లో పాల్గొంటోంది. ఖాళీగా ఉన్న సమయంలో కొత్త అందాలతో ఫొటోలు దిగుతూ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేస్తోంది.

‘బాహుబలి’ మూవీ కోసం సినిమా యూనిట్ కొద్ది రోజుల క్రితమే బల్గేరియా వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ జరుగుతన్న షూటింగ్ లో ప్రభాస్, తమన్నాతో పాటు ఇతర నటులు కూడా పాల్గొంటున్నారు. ఇతర విషయాలు చూస్తే.., తెలుగులో ఈ అమ్మడికి రాజమౌళి ప్రాజెక్టు తర్వాత మరో సినిమా లేదు. ఇక చెన్నైలో అయితే ఆర్య మూవీ తర్వాత ప్రాజెక్టులు ఓకే కాలేదు. వస్తుందని కూడా ఊహించలేము. దీంతో కెరీర్ ఎండింగ్ అని అంటున్నారంతా.

అయితే ఇప్పటికిప్పుడు సినిమా ఆఫర్లు లేకపోయినా.., త్వరలో వచ్చే అవకాశముందని తమన్నా సన్నిహితులు చెప్తున్నారు. గతంలో చాలాకాలం పాటు ఆఫర్లు లేని హీరోయిన్లు కూడా మళ్ళీ టాప్ ప్లేస్ కు చేరారని గుర్తు చేస్తున్నారు. మరి తమన్నా విషయంలో ఇది నిజం అవుతుందా.., లేక హీరోయిన్ గా చివరి ఏడాది అవుతుందా అనేది కొద్దికాలం ఆగితేనే తెలుస్తుంది. ‘బాహుబలి’ తొలి పార్ట్ ను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna bulgeria shooting  baahubali movie  tollywood updates  

Other Articles