మాజి టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఏది చేసినా సంచలనమే. అమ్మడు టాలీవుడ్ లో ఉండగా కోటి పారితోషికం తీసుకున్న తొలి హీరోయిన్ గా రికార్డుకెక్కింది. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి హిట్ కొట్టింది. అలా టాలీవుడ్ ను నిచ్చెనలా ఉపయోగంచుకుని పైకి వెళ్ళిన ఇల్లి..,. బాలీవుడ్ లో సెటిల్ అయింది. ఇంక ఇక్కడ ఏంపని అన్నట్లు సినిమా చాన్సులు వచ్చినా సారీ.. డేట్లు కుదరవు అని సింపుల్ గా పక్కకు తోసేస్తుంది. బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్నట్లు గాసిప్స్ విన్పిస్తున్నాయి.
ఈ విషయాలపై ఓ మీడియా సంస్థ ప్రశ్నించగా ఇలియాలా క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రైవేటు వ్యవహారాలు బయటకు చెప్పుకోవాలని నేను ఎప్పుడూ అనుకోను. నా వ్యక్తిగత విషయాలు చాలా ప్రైవేటుగా ఉంచేందుకే ఇష్టపడతాను. నా గురించి నా కుటుంబానికి తెలిస్తే సరిపోతుంది.., ప్రతి ఒక్కరికీ పర్సనల్ విషయాలు తెలియాలని భావించటం లేదు’’ అని తెలిపింది. ఇక బాయ్ ఫ్రెండ్ అండ్రూ గురించి చెప్తూ.., త్వరలో రాబోతున్న సినిమాలో ఆండ్రూ చిన్న క్యారెక్టర్ చేశాడని అది కామెడి ఓరియంటెడ్ రోల్ అని తెలిపింది.
అదేవిధంగా తాను ప్రస్తుతం సింగిలా లేక డేటింగ్ లో ఉందా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ., ‘‘పెళ్లి అయ్యే వరకు నేను సింగిల్’ మాత్రమే. అని స్పష్టం చేసింది. ఆస్ర్టేలియాకు చెందిన ఆండ్రూ నీ బోన్ తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు ఇండస్ర్టీలో చాలామంది చెప్పుకుంటున్నారు. ఇలియానా ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు, ప్రస్తావించలేదు. అయితే అప్పుడప్పుడూ ఇలా ఆండ్రూ గురించి మాత్రం కాస్తో కూస్తో మాట్లాడేస్తుంది. వీరిద్దరి మద్య సంబందం ఏమిటి అంటే మాత్రం ప్రైవేటు విషయం అడగకండి అని మాట దాటేస్తుందీ గోవా బ్యూటి.
బాలీవుడ్ లో ‘బర్ఫీ’ మూవీతో హిట్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.., అక్కడ చాలా బిజీ అయిపోయింది. ఆమె నటించిన ‘హ్యాపీ ఎండింగ్’ నవంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, గోవింద, కల్కి తదితరులు నటించారు. ప్రస్తుతం అమ్మడు మరో బాలీవుడ్ ఆఫర్ తో సినిమా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more