Pranitha denies rumours on trivikram allu arjun combination movie

pranitha, praneetha news, pranitha hot photos, pranitha comments trivikram, pranitha latest photo shoot, pranitha movies, trivikram srinivas news, trivikram srinivas movies, allu arjun, samantha, nitya menon, adah sharma

pranitha denies rumours on trivikram allu arjun combination movie

నిందలు వేస్తున్నారు.. పుకార్లను నమ్మకండి!

Posted: 11/07/2014 12:58 PM IST
Pranitha denies rumours on trivikram allu arjun combination movie

గతకొన్నిరోజుల నుంచి హీరోయిన్ ప్రణీతకు సంబంధించి కొన్ని పుకార్లు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! అల్లుఅర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రణీతను సెకెండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని.. అయితే పాత్రకు తగ్గట్టుగా ప్రణీత మేకప్ వేసుకుని రాకపోవడం వల్ల దర్శకుడు కోపంతో ఆమె తిట్టాడని... అందువల్లే ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు నిన్నమొన్నటి బాగానే ప్రచారమయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ప్రణీత స్పష్టం చేసేసింది.

తాజాగా ఈ విషయం మీద ప్రణీత స్పందిస్తూ.. ‘నేను అసలు ఆ సినిమాకే సైన్ చేయలేదు. అలాంటప్పుడు షూటింగ్ లో ఎలా పాల్గొంటాను? ఆ సినిమా సెట్స్ నుంచి అలిగి బయటకు వెళ్లిపోయానన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు. ఇదంతా కేవలం పుకార్లు మాత్రమే. ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లను సృష్టించి, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ‘‘అత్తారింటికి దారేది’’ మూవీ విజయం తరువాత నుండి తన కెరీర్ పై నిందలు వేయడానికి ప్రలువురు ప్రయత్నిస్తున్నారు.  ఇలాంటి వార్తలను నమ్మకండి. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని చెప్పుకొచ్చింది.

ఇదివరకే ఈ విషయంపై త్రివిక్రమ్ సన్నిహితులు, మూవీ యూనిట్ వర్గాలు కూడా స్పిందించిన విషయం విదితమే! ‘‘అసలు సినిమాలోనే లేని నటి వచ్చి, షూటింగ్‌లో పాల్గొన్నట్లు.. పైగా ఆమెపై కోపడ్డట్లుగా ఇష్టం వచ్చినట్లుగా రాయడం సరైనది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు’’ అని స్పష్టం చేశారు. ఏదేమైనా.. ఈ పుకార్లపై ప్రణీత, యూనిట్ వర్గాలు స్పష్టం చేయడంతో వీటికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టే! ఇకపోతే త్రివిక్రమ్ - అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సమంత, అదాశర్మ, నిత్యామీనన్లు హీరయిన్లుగా నటిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranitha  trivikram srinivas  allu arjun  samantha  adah sharma  nitya menon  

Other Articles