Producer bellamkonda suresh filed cheating case on director g nageswar reddy

bellamkonda suresh, producer bellamkonda suresh, bellamkonda suresh news, director g nageswar reddy, bellamkonda suresh nageswar reddy, tollywood cheating cases, bellamkonda cheating case, bellamkonda nageswar reddy cheating case, manchu family news

producer bellamkonda suresh filed cheating case on director g nageswar reddy

దర్శకుడిపై ఛీటింగ్ కేసు పెట్టిన నిర్మాత సురేష్!

Posted: 11/06/2014 02:42 PM IST
Producer bellamkonda suresh filed cheating case on director g nageswar reddy

ఈమధ్య తెలుగు ఇండస్ట్రీలో ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. అందుకే... ఎన్నడూలేని విధంగా ఈమధ్య చీటింగ్ కేసులు పెచ్చుమీరిపోతున్నాయి. ఎప్పుడుపడితే అప్పుడు.. ఎవరుపడితేవాళ్లు కేసులు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇదిలావుండగా.. మొన్నటికిమొన్న ఆర్థికాలావాదేవీల విషయంలో మంచువారి కుటుంబంతో నిర్మాతలు కేసులు, గొడవలంటూ గడబిడలు జరిగిపోయిన సంగతి తెలిసిందే! తర్వాత వారిద్దరూ ఆ విషయంలో ఒకరికొకరు రాజీపడటంతో సమసిపోయింది. ఈ వ్యవహారం జరిగి పూర్తిగా రెండునెలలైనా కాలేదు... అప్పుడే మరో చీటింగ్ కేసుతో వార్తల్లోకెక్కేశాడు బెల్లంకొండ!

తాజాగా బెల్లంకొండ సురేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ‘‘దేనికైనా రెడీ’’ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టారు. గతంలో నాగేశ్వర్ రెడ్డి తనతో ఒక సినిమా చేస్తానంటూ తనవద్ద రూ.25 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మోసం చేశాడని సురేష్ అతనిపై పోలీస్ కేసు వేశాడు. ఇప్పుడు తనతో ఒక సినిమా చేయాల్సిందిగా సంప్రదిస్తే నాగేశ్వర్ చేయనంటూ ప్లేటు ఫిరాయించాడని.. గతంలో ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగివ్వలేదని.. అందుకే తన డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ సురేష్ కేసు వేయడం జరిగింది.

2011లో బెల్లంకొండతో దర్శకుడు నాగేశ్వర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం అప్పుడే ఒక సినిమాను చేయాల్సి వుంది. కానీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆ మూవీ డిలే అయింది. అంతే! అప్పటినుంచి దాని గురించి ప్రస్తావనే రాలేదు. ఈ నేపథ్యంలో వేరే సినిమాలతో నాగేశ్వర్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం సురేష్ అతనితో ఒక సినిమా చేయాలని పేర్కొంటుంటే.. నాగేశ్వర్ మాత్రం ససెమిరా అంటున్నాడని నిర్మాత వాపోతున్నాడు. కాబట్టి.. ఆ వ్యవహారంలో తనకు న్యాయం జరిగేలా సహకరించాలని పోలీస్ గడప తొక్కాడు. మరి ఈ వ్యవహారం ఎన్ని వివాదాలను క్రియేట్ చేస్తుందో చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles