Shruti hassan interview hindi movie offers telugu tamil languages

shruti hassan, shruti hassan latest news, shruti hassan press meet, shruti hassan interview, shruti hassan hot photos, shruti hassan hot stills, shruti hassan hot photo shoot, shruti hassan movies, shruti hassan mahesh babu

shruti hassan interview hindi movie offers telugu tamil languages

లెక్కతో సంబంధం లేదు.. నచ్చితే ఎక్కడైనా ఓకే!

Posted: 11/06/2014 11:28 AM IST
Shruti hassan interview hindi movie offers telugu tamil languages

లెజెండరీ హీరో కమల్ కూతురైన శృతిహాసన్... ‘‘లక్కీ’’ హిందీ చిత్రంతో పరిచయమైన విషయం అందరికీ తెలిసిందే! ఇక అక్కడినుంచి తన సినీప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ అమ్మడు... వరుసగా హిందీ, తెలుగు, తమిళ భాషల చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఏ భాష అనేది లెక్క చేయకుండా అవకాశమొస్తే అన్ని భాషల్లోనూ సినిమాలను అంగీకరిస్తూ వస్తోంది. ఇదివరకు తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా వున్న ఈ హాట్ భామ.. ప్రస్తుతం హిందీలో ఎక్కువ సినిమాలను ఒప్పుకుంది. తెలుగు, తమిళంలో ఒక్కో సినిమాతో బిజీగా వున్న శృతి.. రానున్నరోజుల్లో హిందీలో ఫుల్ బిజీ కానుందని సమాచారం! ఈ నేపథ్యంలోనే శృతిని ‘‘ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలను అంగీకరించారు కదా.. మరి ఇకనుంచి హిందీలోనే ఎక్కువ దృష్టిపెడతారా..? అని అడిగిన ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానమిచ్చింది. ఎవరైనా తనను ఈ రకమైన ప్రశ్నలు అడిగితే తనకు నవ్వొస్తుంటుందని తెలిపింది.

ఈ సందర్భంగానే శృతి మాట్లాడుతూ.. ‘‘నాకు భాషతో సంబంధం వుండదు. కథ విన్న తర్వాత బాగుందనిస్తే నాకు తెలియని ఏ బాషలోనైనా నటిస్తాను. అందుకే నా మాతృభాష తమిళం అయినా.. కథ నచ్చడం వల్ల హిందీ సినిమాలో నటించాను. తెలుగులో ఇన్ని, తమిళంలో ఇన్ని సినిమాలు చేయాలనే లెక్కలేవీ నాకు లేవు. అలాంటి సమీకరణాలు నాకు వద్దు. ఇటీవల నేను విన్న హిందీ కథలు బాగా నచ్చాయి కాబట్టి నటించేందుకు ఒప్పుకున్నాను. రేపు అదేస్థాయిలో తమిళ, తెలుగు, ఇతర భాషల్లో కథలు నచ్చితే అవి కూడా వరుసగా చేయొచ్చు. నాకు సినిమాలు సదరు భాషల్లో ఇన్నే చేయాలనే లెక్కల్లేవు.. కథ నచ్చితే ఎక్కడైనా ఓకే!’’ అని సమాధానమిచ్చింది ఈ హాట్ బ్యూటీ! ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన ఒకటి, తమిళంలో మరొకటితోపాటు హిందీలో వరుసగా ఐదు చిత్రాలతో బిజీగా వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shruti hassan  mahesh babu  bollywood movies  telugu news  indian film actresses  

Other Articles