Maryam zakaria got secret marriage two years back

maryam zakaria marriage, maryam zakaria secret marriage, maryam zakaria delivery, maryam zakaria latest news, tollywood heroine secret affairs, tollywood item girls, tollywood latest news, secret marriages

maryam zakaria got secret marriage two years back : hot actress maryam zakaria says she married two years back and she is pregnant now. maryam zakaria announced her marriage and also her delivery date by february 14 2015

పెళ్ళి రహస్యం.. ప్రగ్నెన్సి ప్రకటన

Posted: 11/05/2014 04:14 PM IST
Maryam zakaria got secret marriage two years back

సినీ తారలు వ్యక్తిగత విషయాల గురించి చాలా సీక్రెట్ మెయిన్టైన్ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఇక హీరోయిన్లు అయితే మరీ ఎక్కువనే చెప్పాలి. బాయ్ ఫ్రెండ్స్, పెళ్లి, కుటుంబ వివరాలు అంత త్వరగా బయటకు రానివ్వరు. చాలామంది సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సంఘటనలు ఎన్నో గతంలో బయటకు వచ్చాయి. ఇప్పటికి చాలా మంది సీక్రెట్ గా ఎఫైర్లు నడుపుతున్నారు. ఇక స్పెషల్ సాంగ్స్ కు డాన్స్ చేసి యువతను ఉర్రూతలూగించిన మరియం జకారియా కూడా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందట. ఈ విషయాన్ని స్వయంగా మరియం ప్రకటించింది.

రెండేళ్ళ క్రితం అంటే 2012లో తనకు నచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. గోవా బీచ్ లో జరిగిన ఈ కార్యక్రమంకు కేవలం కొద్దిమంది బాలీవుడ్ ప్రముఖులకు మాత్రమే పెళ్ళి గురించి తెలుసని చెప్పింది. అరవింద్(భర్త)తో తన ప్రైవసికి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో పెళ్ళి గురించి బయటకు చెప్పలేదట. ఇక ప్రస్తుతం తాను గర్భవతినని కూడా మరియం జకారియా ప్రకటించింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న డెలివరీ డేట్ అని చెప్పింది.

ఇక పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్ గురించి ప్రస్తావిస్తే..., 60ఏళ్ళు వచ్చిన వారు కూడా ఎంచక్కా సినిమాల్లో చేస్తుంటే నేను ఎందుకు మానుకోవాలి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం, మాతృత్వ మాధుర్యంను అనుభవించాలి కాని సినిమాను వదులుకుంటాను అని చెప్పటం లేదు. పిల్లలు పుట్టినా నాకు సినిమా ఆఫర్లు వస్తాయని చెప్తోంది. ‘100%లవ్’, ‘బ్రహ్మీగాడి కథ’, ‘రౌడీ రాథోర్’, ‘గ్రాండ్ మస్తీ’ తదితర సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మరియం జకారియా నటించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maryam zakaria  marriage  delivery date  latest news  tollywood  

Other Articles