Happy new year movie collections creates new record at box office

happy new year movie records, happy new year movie collections, happy new year songs, happy new year movie download, happy new year review and rating, bollywood latest news, shahrukh khan in happy new year

happy new year movie collections creates new record at box office : last week released happy new year movie creating records at box office in a week this got 108crore rupees collections. with latest collections of happy new year this movie is first in box office records list

రికార్డులు బద్దలు కొడుతున్న బాలీవుడ్ బాద్ షా

Posted: 10/29/2014 01:22 PM IST
Happy new year movie collections creates new record at box office

బాలీవుడ్ బాద్ షాగా పేరున్న షారూక్ ఖాన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘హ్యాపి న్యూ ఇయర్’ కలెక్షన్ల వరద పారిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన సినిమా మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. ఇక తాజా లెక్కలను చూస్తే.., కళ్లు తిరగక మానదు. కొయిమొయి (koimoi.com) వెబ్ సైట్ లెక్కల ప్రకారం మంగళవారం వరకు ఈ సినిమా 136.86 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే అన్ని దేశాల్లో కలిపి 2వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ దెబ్బతో మిగతా సినిమాల బాక్సాఫీస్ రికార్డులన్నీ షారూక్ బద్దలు కొట్టాడు. ఈ సినిమా ఈ ఏడాదిలో తొలివారంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు రూ. 94.13కోట్లతో ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా తొలి స్థానంలో ఉండగా ఇప్పుడు రెండవ ప్లేస్ కు వెళ్లింది. షారూక్ దీపికా పడుకునే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని ఫరాఖాన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో బాద్ షా కొడుకు అబ్ రామ్ తొలిసారి తెరముందు కన్పించటం జరిగింది.

గమనిక : వివిధ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ రికార్డుల జాబితాను తయారు చేయటం జరిగింది. ఇందులో ఇచ్చిన వివరాలు అన్నీ దాదాపుగా సరైనవే. అయితే వాటి ఖచ్చితత్వంను మాత్రం స్పష్టంగా చెప్పలేము. కాబట్టి పాఠకులు స్పందించేముందుగా ఒకసారి పరిశీలించుకోగలరు. కలెక్షన్లకు సంబంధించి చేసే క్లెయిములతో మాకు సంబంధం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : happy new year  shahrukh khan  collections  box office  

Other Articles