Court cases on vijay and murugadas

kaththi movie cases, case on vijay and murugadas, kaththi movie collections, kaththi movie telugu remake, kaththi movie free download, court case on kaththi movie, pawan kalyan in kaththi movie, pawan kalyan on kaththi movie, kaththi telugu movie

ourt cases on vijay and murugadas : pawan kalyan to decide wheather kaththi is to remake or not with latest court cases on movie : a lawyer filed cases against kaththi movie heads for showing court enquiring 2g case asked to sue movie unit for this act

పవన్ ఏమనుకుంటున్నాడు... కోర్టు కేసుపై ఎలా స్పందిస్తాడు..?

Posted: 10/29/2014 01:03 PM IST
Court cases on vijay and murugadas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆశలపై కోర్టు కేసు నీళ్ళు చల్లింది. సూపర్ హిట్ సినిమా అయినా సరే.., కేసు పడటంతో ఇప్పుడెలా చేయటం అని టాలీవుడ్ ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారు. పవన్ తో రీమేక్ చేయించాలని భావిస్తున్న ‘కత్తి’ సినిమాకు కష్టాలు ఇంకా వీడటం లేదు. పెద్ద వివాదాలను ఎదుర్కుని తమిళంలో విడుదల అయిన ఈ సినిమా సక్సెస్ పుల్ గా నడుస్తోంది. అయితే ఈ సినిమాను ఇప్పటికి వివాదాలు వదలటం లేదు. తాజాగా సినిమా లో ఉన్న కొన్ని సీన్లపై హీరో విజయ్, డైరెక్టర్ మురుగదాస్ కు కోర్టు నోటిసులు పంపింది.

రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు అనే సామాజిక కోణంతో విడుదల అయిన ‘కత్తి’లో 2జీ స్పెక్ర్టం అంశం ఉంది. అయితే ఓ కేసు విచారణలో ఉండగా ఈ అంశాన్ని లేవనెత్తటంపై వివాదం చెలరేగింది. ఇది చట్టవిరుద్ధం అంటూ మధురైకి చెందిన ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. హీరో విజయ్, డైరెక్టర్ మురుగదాస్ తో పాటు నిర్మాణ సంస్థను ప్రతివాదులుగా చేరుస్తూ కేసు వేశారు. ఈ సినిమాను పవన్ తో తెలుగులో రీమేక్ చేయించాలి అనుకుంటున్న తరుణంలో ఇలా కేసు వేయటంతో తెలుగు రీమేక్ కొనాలి అని ప్లాన్ లో ఉన్న ఠాగూర్ సహా ప్రొడ్యసర్లు జంకుతున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా చూసిన తర్వాత తీయాలా.., వద్దా అనేది డిసైడ్ అవుతానని పవన్ చెప్పారు. పవన్ కోసం మంగళవారం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. కాగా ఇప్పుడు పవన్ ఏం చెప్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. సినిమాను రీమేక్ చేస్తారా లేక... వదిలేస్తారా అనేది పవర్ స్టార్ నిర్ణయంతో తెలుస్తుంది. అయితే ఈ సీన్ ను పక్కన బెట్టేసి.. మిగతా సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుంది అని కొందరు సలహాలు ఇస్తున్నారు. లేదా వివాదంకు కారణం అయిన సీన్లకు ప్రాధాన్యం ఉంది అనుకుంటే మరో కేసు గురించి ప్రస్తావించి కధ నడపాలి అని సలహా ఇస్తున్నారు. అయితే వాస్తవానికి సినిమాలో ఏముంది అనేది తెలియకుండా మార్పులు ఎలా సాధ్యమో తెలియటం లేదు.

దీపావళి సందర్భంగా 'కత్తి' సినిమా ఒకే రోజు రూ.15.50 కోట్లు వసూలు చేసి తమిళ సినీ పరిశ్రమలో రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. గతంలో విజయ్ హీరోగా చేసిన ‘ఖుషీ' సినిమాని పవన్ తెలుగులో రీమేక్ చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అలాగే ఈ మూవీ కూడా తెలుగులో రీమేక్ చేద్దామనుకుంటే ఇంతలో కోర్టు కష్టాలు మొదలయ్యాయి. మరి ఈ ప్రాజెక్టు చివరకు ఏమవుతుందో. ‘కత్తి' విషయానికి వస్తే రైతులకు, సెజ్ మధ్య జరిగే పోరాటమే సినిమా. అన్నదాతలు భూముల్ని ఎలా కోల్పోతున్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణాలు, వంటి సమస్యలతో సందేశాత్మకంగా సినిమా తీశారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kaththi  vijay  court case  pawan kalyan  

Other Articles