Kalyan ram patas first look and motion poster released

patas movie first look, patas movie poster, kalyan ram look in patas, kalyan ram patas movie latest updates, patas movie photos, tollywood latest news, diwali celebrations in tollywood, diwali celebrations in andhrapradesh

kalyan ram patas first look and motion poster released : nandamuri kalyan ram latest movie patas first look and motion poster released as diwali gift for fans. ram looks heroic and serious face in police dress also lights ciger with cracker this getting good response from fans

అదరగొడుతున్న రామ్ పటాస్ ఫస్ట్ లుక్

Posted: 10/23/2014 09:30 AM IST
Kalyan ram patas first look and motion poster released

నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘పటాస్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల కోసం పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. పోస్టర్ లో రామ్ లుక్ అదిరిపోయింది అని అప్పుడే టాక్ వచ్చేసింది. ముఖంలో సీరియస్, హీరోయిజం కన్పించటంతో పాటు.., పోలిస్ డ్రెస్ లో సిగరెట్ ను పటాస్ తో వెలిగించుకుంటున్న స్టయిల్ చాలా బాగుంది అని అభిమానులు అంటున్నారు. ఈ పోస్టర్ తో సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. హిట్ కొట్టడం ఖాయమని.., థియేటర్లు దద్దరిల్లుతాయని ఫేస్ బుక్, ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘పటాస్’ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలిస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా., కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ‘ఎన్టీఆర్ ఆర్స్ట్’ బ్యానర్ పై రామ్ నిర్మిస్తున్నారు. సాయి కార్తిక్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో.., అంటే డిసెంబర్ లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్దికాలంగా పెద్దగా సినిమాలు చేయని.., హిట్ రుచి చూడని కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్టు కోసం బాగా కష్టపడుతున్నాడు.

విశేషం ఏమిటంటే నందమూరి సోదరుల కొత్త సినిమాలు రెండూ పోలిస్ క్యారెక్టర్ తో వస్తున్నవే. కళ్యాణ్ రామ్ ‘పటాస్’ మూవీలో పోలిస్ క్యారెక్టర్ కాగా..,  ఎన్టీఆర్-పూరి కాంబినేషన్ కొత్త సినిమాలో కూడా తారక్ పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. నందమూరి నటవారసులు ఇద్దరూ ఇలా పోలిస్ ఆఫీసర్లుగా వస్తుండటంతో ఎవరి కథలో ఏం విశేషం ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు జూనియర్ షూటింగ్ కూడా త్వరలో పూర్తి కానుంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయితే డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల కావచ్చు. అంటే నందమూరి ఫ్యామిలి నుంచి ఇద్దరు పోలిసులు ఒకేసారి పోటిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.., ప్రస్తుతానికి సినిమా మోషన్ పోస్టర్ చూసి పండగ చేసుకొండి.

 

 


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : patas  kalyan ram  first look  latest updates  

Other Articles