Poorna and other heorines interested in doing item songs

poorna item songs, actress poorna movies, sruti haasan item songs, mamatha mohan das item songs, sruti hassan next movie, telugu ever green songs, heroines item songs, tollywo0od latest updates

actress poorna and other heorines interested in doing item songs : indian film heroines becoming commercial in recent days all are thinking about money and doing item songs to get money

కూటి కోసం ఐటం పాట్లు... ఆరబోతకు అగ్రతారల సై

Posted: 10/17/2014 05:30 PM IST
Poorna and other heorines interested in doing item songs

కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. కాని మన హీరోయిన్లు మాత్రం కూటి కోసం ఐటం విద్యలు చేస్తున్నారు. కమర్షియల్ అయిపోయిన తారలు.., స్పెషల్ సాంగ్స్ లో తళుక్కుమంటున్నారు. ఒకప్పుడు చేయాలంటే నామోషి.గా ఫీల్ అయిన ఐటం సాంగ్స్ నే ఇప్పుడు నేనంటే నేను అని పోటి పడుతున్నారు. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్ ఇలా దేశంలోని ఏ ఇండస్ర్టీని చూసినా ఈ మద్య టాప్ హీరోయిన్లే ఐటం సాంగ్స్ చేస్తున్నారు. తమ అందాలకు అదనపు టచప్ ఇచ్చి.., మరింత ఆకట్టుకుంటున్నారు. భారీగా మూటగట్టుకుంటున్నారు.
.
తెలుగులో కొద్దికాలం వరకూ ఐటం సాంగ్స్ కు సంబంధించి ఓ సాంప్రదాయం ఉండేది. ఈ పాటల్లో నటించేవారు ఎక్కువగా హీరోయిన్లుగా వచ్చేవారు కాదు. ఎక్కడో అడపాదడపా.., కుదిరితే కొన్ని స్పెషల్ క్యారెక్టర్లు చేసేవారు. ఐటం సాంగ్ లను చేయమని హీరోయిన్లను కోరితే.., అలాంటి పాటలు మేమెందుకు చేస్తాము అని చులకన చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఐటం డాన్సర్లంటే వీరికి అంత చులకన. కాని ఇప్పుడీ పాటలకు క్రమంగా క్రేజ్ పెరగటంతో స్టార్ హీరోయిన్ల కన్ను వీటిపై పడింది. ఇంత డిమాండ్ ఉన్న పాటను తాము ఎందుకు వదులుకోవాలి అనుకుంటున్నారు.

పైసా.., పేరు

హీరోయిన్ల కోసం ఐటం సాంగ్ ను ఈ మద్య పేరు మార్చి ఈ మద్య స్పెషల్ సాంగ్స్ అంటున్నారు. ఈ పాటల వల్ల హీరోయిన్లకు ఎక్కువ డబ్బు వస్తుంది. పైగా ఎక్కువ రోజులు షూటింగ్ కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలా ఓ నాలుగైదు రోజులు చేస్తే లక్షల రూపాయలు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటివల్ల హీరోయిన్లకు పబ్లిసిటీ పెరుగుతుంది. ఆ హీరోయిన్ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందట అని అంతా చర్చించుకుంటారు. ఇలా డబ్బులకు డబ్బులు.., ఫ్రీ పబ్లిసిటీ వస్తుండటంతో భామలంతా వీటిపై కన్నేశారు. టైంపాస్.. పాకెట్ కోసం పార్ట్ టైం జాబ్ అన్నట్లుగా.., ఈజి మని ప్రచారం కోసం ఇలా ఎత్తులేస్తున్నారు.

బాలీవుడ్ లో కత్రినాఖైఫ్, దీపిక పడుకునే, బిపాషా, టాలీవుడ్ లో శ్రియ, చార్మి, శృతి హాసన్, మమతా మోహన్ దాస్, కోలీవుడ్ లో ప్రియమణి తదితరులు చేసిన స్పెషల్ సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. వీరి సరసన తాజాగా మళయాళ భామ పూర్ణ చేరింది. ఈమె కూడా ఈజిమని, పాపులారిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ.., స్పెషల్ అయితే ఓకే అనేసిందట. ‘అప్పా టక్కర్’ అనే తమిళ సినిమాలో ఈ అమ్మడి పాట ఉందట. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. ఇలా ప్రతి ఒక్కరూ స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ పోతే.., వాటినే నమ్ముకుని ఇండస్ర్టీలో ఉన్న వారి సంగతి ఏమిటి. ఒక్కసారి ఆలోచించండి డబ్బుల కోసం ఏమైనా చేయటం మానుకుని.., మిగతా కళాకారులు కూడా బాగుపడాలి అని కోరుకోండి.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poorna  item songs  latest updates  tollywood  

Other Articles