Rajamouli acting in a movie

rajamouli, ss rajamouli wiki, ss rajamouli latest movies, ss rajamouli latest updates, ss rajamouli family, ss rajamouli gossips, ss rajamouli upcoming movies, ss rajamouli acting, ss rajamouli on bahubali, bahubali release date, bahubali latest updates, bahubali latest photos, bahubali prabhas, bahubali movie news, bahubali upates, bahubali shooting images, latest updates, latest telugu gossips, movie news, tollywood updates, mana kurralle movie, mana kurralle release date, rajamouli in mana kurralle

director rajamouli acting in a movie named mana kurralle as a guest role : successful director rajamouli busy with his movies and also helping others projects he recently acted for a movie named maka kurralle

కుర్రాళ్ళ కోసం గెస్ట్ రోల్ చేశారట

Posted: 10/14/2014 02:42 PM IST
Rajamouli acting in a movie

రాజమౌళి మంచితనం గురించి సినిమావర్గాలకు తెలియనిది కాదు. ఇతరుల సినిమాలకు తనవంతుగా సాయం చేయటంతో పాటు.., మూవీలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తిగా గుర్తింపు పొందాడు. హిట్ సినిమాలు తీస్తూ బిజిగా ఉండే జక్కన్న.., ఇతరుల సినిమాల కోసం తనవంతుగా సాయం కూడా చేస్తున్నాడు. ఓ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ చేశాడని టాలీవుడ్ టాక్. ‘మన కుర్రాళ్ళే ( ది లేటెస్ట్ జనరేషన్)’ అనే పేరుతో నిర్మితమవుతున్న సినిమాలో జక్కన్న నటించాడట.

కధలో ఉండే ఓ ఆడియో ఫంక్షన్ కు రాజమౌళి వస్తాడన్నమాట. ఇదే సినిమాలోని మెయిన్ లీడ్ సన్నివేశం అని అంటున్నారు. ఈ క్యారెక్టర్ కోసం రాత్రి ఎనమిది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు జక్కన్న షూటింగ్ లో పాల్గొన్నారు. నిద్రను మానుకుని కుర్రాళ్ళను సంతృప్తి పర్చటం కోసం సెట్ లో ఉండటం పట్ల అంతా మెచ్చుకుంటున్నారు. గతంలో రాజమౌళి ‘రెయిన్ బో’ అనే సినిమాలో కూడా అలా కన్పించారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే కాకుండా ఇలా అప్పుడప్పుడూ గెస్ట్ రోల్ క్యారెక్టర్లు చేస్తూ తనలోని నటుడిని బయటకు తీసుకువస్తున్నారు జక్కన్న.

ఇక ‘మన కుర్రాళ్ళే ( ది లేటెస్ట్ జనరేషన్)’ సినిమా విషయానికి వస్తే.., అరవింద్ కృష్ణ, ప్రగతి, రాజ్‌కళ్యాణ్ ప్రధాన క్యారెక్టర్లుగా ఈ సినిమా రూపొందుతోంది. సొంత బ్యానర్ వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పై వీరశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి రాజ్ సంగీతం అందిస్తున్నారు. బ్రతుకుతెరువు కోసం పట్నానికి వచ్చిన గ్రామీణ ప్రాంత యువకులు తమ ఊరికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించారు అనే నేపధ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సమాజానికి సందేశం ఇచ్చే కోణంలో సినిమా ఉంటుదని డైరెక్టర్, నిర్మాత తెలిపారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  mana kurralle movie  bahubali  tollywood  

Other Articles