Kcr help to ranirudrama movie

kcr, kcr comments, kcr latest, kcr funny, kcr images, kcr family, telangana, latest news, films, movie news, rudramdevi, rudramdevi movie, rudramdevi latest news, rudramdevi latest photos, rudramadevi movie release date, anushka, anushka hot, anushka latest, anushka movies, anushka gossips, anushka marriage, anushka latest hot photos, tollywood, gunashekar, allu arjun

telangana chief minister kcr to give tax exemption to rudramdevi movie because the story belongs to telangana : gunashekar met kcr to ask tax exemption to rudramadevi movie which made with telangana story

అనుష్కకు కేసీఆర్ అండ

Posted: 10/08/2014 10:26 AM IST
Kcr help to ranirudrama movie

అందాల భామ అనుష్కకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. అనుష్క తాజా సినిమా ‘రుద్రమదేవి’కి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు కేసీఆర్ ను ‘రుద్రమదేవి’ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన రాణి రుద్రమదేవి కధను సినిమాగా తెరకెక్కించినందున.. తెలంగాణలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

రాష్ర్ట చరిత్ర, బాష, ప్రాంతీయత, ఇతర సమాజ హిత సినిమాలకు పన్ను మినహాయింపు ఇవ్వటం జరుగుతుందన్న విషయం అందరికి తెలిసిందే. అందులో భాగంగానే కాకతీయుల వీరవనిత రాణి రుద్రమ కధ నేపథ్యంగా తెరకెక్కిన ‘రుద్రమదేవి’ కి కూడా పన్ను మినహాయింపు వర్తించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ సినిమాగా వస్తున్న ‘రుద్రమదేవి’కి తెలంగాణలో పన్ను మినహాయింపు వస్తే కాస్తయినా నిర్మాతకు ఖర్చు తగ్గినట్లే అని చెప్పవచ్చు. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు.

ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సిద్ధమవుతోంది. ‘అరుంధతి’ తర్వాత అంతకు రెట్టింపు అంచనాలతో వస్తున్న ఈ సినిమా హిట్ అయితే అనుష్క కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుంది. అటు సినిమా విడుదల కాకముందే ‘రుద్రమదేవి’కి వివిధ విభాగాల్లో అవార్డులు రావటం ఖాయమని సినిమా వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  rani rudrama  guna shekar  anushka  

Other Articles