Mahesh babu can t decide to select movies by own

maheshbabu, mahesh babu latest, mahesh babu, mahesh babu wiki, mahesh babu aagadu, aagadu movie review, mahesh babu team, mahesh babu family, mahesh babu son, mahesh babu, daughter, latest news, mahesh babu aagadu movie review, aagadu movie rating, tollywood, puri jagannath, vv vinayak, boyapati srinu, koratala shiva

tollywood prince mahesh babu has one defect that he can't select movies by his own always depends on a team behind him : a team leading maheshbabu in deciding movies to be select for future projects

సొంతంగా డిసైడ్ చేయలేకపోతున్నాడు.

Posted: 09/20/2014 11:19 AM IST
Mahesh babu can t decide to select movies by own

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి చెప్పాలంటే తెలుగు అమ్మాయిలను అడిగితే సరిపోతుంది. మహేష్.. మై ప్రిన్స్ అంటూ వారు సూపర్ స్టార్ ను కలల్లో ఊహించుకుంటూ బతికేస్తారు. మహేష్ కాకపోయినా.., అలాంటి వ్యక్తి జీవితంలో దొరికితే బాగుండు అనుకుంటారు. కాని మహేష్ గురించి ఓ నిజం తెలిసింది. అదే తాను ‘సొంతంగా కధలను ఎంపిక చేసుకోలేడ’ని. సినిమాల ఎంపికలో ఓ టీం ఆయన వెనక ఉండి నడిపిస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. టీం చెప్పిన సలహాలు పాటించి సినిమాలు ఒప్పుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో పాపులర్, డిమాండ్ ఉన్న హీరోల్లో మహేష్ ఒకరు. అయితే ఏ హీరోకైనా ఎంతమంది ఫ్యాన్న్ ఉన్నా.., హిట్ రికార్డు లేకపోతే.. ఏదో లోటులా ఉంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కు కూడా ఇదే ఉంది. ఈ మద్య వచ్చిన సినిమాలు సరిగా ఆడక కెరీర్ ను కాస్త ఇబ్బంది పెడుతున్నాయి. చేతిలో ఆఫర్లు ఉన్నా.. చేసిన సినిమాలు ఆడటం లేదే అనే బెంగ పట్టుకుంది. హిట్ రావాలంటే కావాల్సింది సరైన కధ. ఇది లేకపోవటం వల్లే ‘ఆగడు’కు కాస్త మైనస్ అయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కధ ఎంపిక సరిగా ఉంటే సినిమా విజయం సాధిస్తుందని అందరికి తెలుసు.

ఈ కధ ఎంపిక విషయంలో మహేష్ కొందరు సన్నిహితులను సలహా కోరుతున్నట్లు తెలుస్తోంది. అటు వీరు కూడా కోటరీలా మారిపోయి కోర్ కమిటీ లెవల్లో చర్చలు జరిపి సినిమా చేయాలా.., వద్దా అనేది డిసైడ్ చేస్తున్నట్లు సమాచారం. వారు చేయమంటే డైరెక్టర్ కు కాల్ షీట్లు.. లేదంటే డేట్లు లేవు అని చెప్పటం జరుగుతుందని ఫిలింనగర్ వర్గాల టాక్. టాలీవుడ్ యువరాజు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా.., ఇలా కోటరీని సంప్రదించి కొంప కొల్లేరు చేసుకుంటునారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇక్కడ పెద్ద వింత ఏమి లేదు. సినిమాలు చేయాలంటే కధను తనతో పాటు ఇతరులకు విన్పించి ఎలా ఉంటుంది అని సలహా తీసుకోవటం ఉత్తమం. అయితే వారి సూచన మేరకే సినిమాలు చేయటం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయం.

వరసగా పోలిస్ క్యారెక్టర్లు చేసి., ‘ఆగడు’లో కూడా అదే కధను ఎంపిక చేసుకోవటానికి ఈ కోటరీ కారణంగా తెలుస్తుంది. ప్రిన్స్ పోలిస్ డ్రస్ ఫీవర్ ఇంకా అలాగే ఉండటంతో హిట్ అవుతుందని వారు చెప్పారట. అందుకే చేసినట్లు సన్నిహితులు అంటున్నారు. వీటితో పాటు మహేష్ కెరీర్ బాగుండాలంటే సినిమాలు త్వరగా చేయటంతో పాటు.., కొత్త డైరెక్టర్లు., వినూత్నమైన కధలను ఎంపిక చేసుకోవాలని శ్రేయోభిలాషులు సూచిస్తున్నారు. కామెడి, మాస్ ఓరియంటెడ్ సినిమాలు చూసుకుని కధలు కాస్త కొత్తగా ఉంటే అభిమానులకు నచ్చుతాయని చెప్తున్నారు. మరి కోటరీ ఏం చెప్తుందో.. యువరాజు ఎలా నిర్ణయం తీసుకుంటాడో...?

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  team  aagadu  latest news  

Other Articles