Kannada actress sanjana gets offer in ravibabu avunu 2 movie

kannada actress sanjana, sanjana latest news, sanjana hot photos, sanjana movies, sanjana ravibabu, sanjana avunu 2 movie, ravibabu sanjana, avunu 2 movie news, director ravibabu

kannada actress sanjana gets offer in ravibabu avunu 2 movie : director and actor ravibabu gave a special role to kannada hot actress sanjana in his latest movie avunu 2

సోగ్గాడితో కనెక్ట్ అయి.. బుక్కయ్యింది!

Posted: 08/11/2014 05:32 PM IST
Kannada actress sanjana gets offer in ravibabu avunu 2 movie

(Image source from: kannada actress sanjana gets offer in ravibabu avunu 2 movie)

ఎప్పుడో ఒకసారి అరకొర సినిమాల్లో హాట్ సీన్లుగానీ, సైడ్ క్యారెక్టర్లుగానీ చేసి టాక్ ఆఫ్ టౌన్ గా నిలబడిపోయే సంజన... ఇప్పుడు అనుకోకుండానే వార్తల్లోకెక్కేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె జరిగిన సంఘటన ఎంతో విచిత్రమైనది. తనకు తెలియకుండానే ఓ సోగ్గాడితో కనెక్ట్ అయి... బుక్కయ్యింది. ఇలా బుక్కయ్యిందో లేదో.. అప్పుడు గంతులేస్తూ కేకలు పెట్టడం మొదలుపెట్టేసిందట ఈ అమ్మడు!

ఈమధ్య ఏదో ఒక సందర్భంలో ఈ హాట్ బ్యూటీ సంజన, నటుడు-డైరెక్టర్ రవిబాబు అనుకోకుండా కలుసుకున్నారు. అప్పుడు రవిబాబు ఆమెను పలకరించగా.. ఆమె మాత్రం అతనిని గుర్తుపట్టలేకపోయిందట! దీంతో అతను గతంతో తామిద్దరం కలిసి ‘‘సోగ్గాడు’’ సినిమాలో నటించిన సంగతిని గుర్తు చేశాడట! ఈ విషయం చెప్పిన వెంటనే ఆమె కూడా గుర్తు చేసుకుని కొద్దిసేపటి వరకు సంభాషణలు జరుపుకున్నారట!

ఈ నేపథ్యంలోనే రవిబాబు ఆమెను తన తాజా చిత్రం ‘‘అవును 2’’ గురించి చెబుతూ... ‘‘తన సినిమాలో ఒక కీలకపాత్ర వుందని, ఆ పాత్రలో నటిస్తావా..?’’ అని అడిగాడట! దీంతో వచ్చిన అవకాశాన్ని అదునుగా భావించి ఈ అమ్మడు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ఓకే చేసేసిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా ఈ విధంగా ఈ హాట్ బ్యూటీ ‘‘సోగ్గాడు’’తో కనెక్ట్ అయి.. బుక్కయ్యిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఎప్పుడు హాట్ డ్రెస్సులు వేసుకుని కనిపించే ఈ అమ్మడు.. ఈ సినిమాలో ఎలా కనిపించబోతోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles