Mohan babu praises ram gopal varma

mohan babu latest news, ram gopala varma latest news, mohan babu ram gopala varma, anukshanam movie news, anushkanam movie release date, anukshanam movie press meet, manchu vishnu latest news, manchu vishnu latest movies, ram gopal varma mohan babu

Mohan babu praises ram gopal varma : padma sri award winner actor mohan babu praises director ram gopal varma in anukshanam press meet which is held at hyderabad prasad labs

మోహన్ బాబును బానిస చేసుకున్న వర్మ!

Posted: 08/06/2014 11:03 AM IST
Mohan babu praises ram gopal varma

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియనివారు బహుశా మన భారతదేశంలో ఎవ్వరూ వుండరు. ఆయన ఏది చేసినా అదొక పెద్ద సెన్సేషన్ గా మిగిలిపోతుంది. మన దేశంలో జరిగిన యదార్థ సంఘటనలు అచ్చం అలాగే తీయడంలో వర్మ దిట్ట! అందుకే.. ఈయన ఎన్ని సంచలన చిత్రాలు తీసినా... అందులో ఆయన కనబరిచే కొత్తదనానికి చాలామంది దాసోహం అయిపోతారు. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్ తోనే చిత్రాలను తెరకెక్కించడంతోపాటు.. నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా సరికొత్త ట్రిక్కులను ప్లే చేయడంలో ఈయనకు ఈయనే సాటి! ఈయనలో వున్న ఈ కాన్ఫిడెన్స్ ని చూసి నిర్మాతలు ఈయనతో చిత్రాలు చేయడానికి ముందుకు వస్తారు. తెలుగులోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈయనకు దాసోహం అయిన చాలామందే వున్నారు.

ఇప్పుడు తాజాగా ఇటువంటి జాబితాలోకి టాలీవుడ్ విలక్షణ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు చేరిపోయినట్టు స్వయంగా తానే ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారిపోయింది. ‘‘నేను ఇన్నేళ్ల నా సినీ కెరీర్ లో ఎందరో దర్శకులతో పనిచేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావాలు గల వ్యక్తులతో నాకు బాగానే పరిచయం వుంది. వారందరితో నా అనుభవం వేరేది కానీ వర్మలాంటి క్రమశిక్షణ కలిగిన దర్శకుణ్ణి మాత్రం నేను ఎవ్వరినీ చూడలేదు. ఆయనతో చేసింది కేవలం ఒక్క సినిమానే అయినా.. అందులో ఆయన వర్కింగ్ స్టైల్ కు నేను బానిసనయ్యాను. సినిమా తప్ప ఆయనకు మరొక ప్రపంచమంటూ లేకుండా పూర్తిగా వర్క్ లో మునిగిపోతారు. సినిమా లాభాల్లో కేవలం నలుగురే కాదు.. అందరూ భాగస్వాములు అయ్యేలా వుండాలనేది వర్మ ఆలోచన’’ అంటూ బాబు, వర్మను పొగడ్తలతో ముంచెత్తారు.

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తాజాగా రూపొందించిన చిత్రం ‘‘అనుక్షణం’’! ఈ చిత్రం ఈనెల 15వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన సమావేశంలో మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. అమ్మాయిల కిడ్నాప్, హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వర్మ ఈ చిత్రంకోసం ప్రత్యేకంగా వేలంపాట పద్ధతిని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles