Humaima malick emraan hashmi liplock

Humaima Malik Loves Lip Lock, Emraan Hashmi is an expert in kissing, Humaima Malick loved shooting rain song with Emraan, Emraan Hashmi romances Humaima Malik, Emraan Smooches Humaima In Rain Song, Emraan Hashmi to romance Pakistani actress Humaima,

Emraan Hashmi is an expert in kissing: The new song 'Tere ho ke rahenge' from 'Raja Natwarlal' showcases ... between Emraan and Humaima, where he romances her in the rain. Humaima Malick loved shooting rain song with Emraan

ముద్దుల్లో ఆయనే కింగ్... చాలా నచ్చింది.

Posted: 08/05/2014 12:40 PM IST
Humaima malick emraan hashmi liplock

బాలీవుడ్ ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా నట్వర్ లాల్’. ఈ చిత్రంలో హీరోయిన్ గా పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్ నటిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య లిప్ లాక్ సన్నీవేశాలు, చాలా శృంగార సన్నీవేశాలు ఉన్నాయి. వీటి గురించి హుమైమా చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సన్నీవేశాల గురించి హుమైమా మాట్లాడుతూ... ఈ సినిమాలో ఇమ్రాన్‌తో కలిసి నటించడం చాలా సౌకర్యంగానే అనిపించింది. ఇందులో ముద్దు సీన్లను చిత్రీకరించే రోజు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఎందుకంటే నా నటజీవితంలో ఇప్పటిదాకా ముద్దు సీన్లలో నటించలేదు అని తెలిపింది.

కానీ అప్పటికే ముద్దు సీన్లలో అనుభవమున్న ఇమ్రాన్ నా భయాన్నంతా పోగొట్టాడు. అసభ్యంగా ఉందన్న అభిప్రాయం ఏమాత్రం కలగకుండా చేశాడు. పలు శృంగార దృశ్యాలను కూడా అసభ్యతకు ఏమాత్రం తావులేకుండా దర్శకుడు తెరకెక్కించాడు. మొత్తానికి అంతా బాగానే జరిగిపోయింది. అయితే ఇటువంటి దృశ్యాల్లో నటించిన తర్వాత నేను మళ్లీ పాకిస్థాన్‌కు వెళితే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటిని ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
 
కానీ నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నా. విమర్శించేవారు కూడా ఉంటారు. వారి విమర్శలను పట్టించుకుంటే కూర్చుంటే కెరీర్‌లో నేను ఇంతకుమించి ముందుకెళ్లలేన’ని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇకపై తాను బికినీ వేసుకోనని స్పష్టం చేసింది. ఇమ్రాన్ హష్మీ, హుమైమా మాలిక్ జంటగా నటించిన ఈ ‘రాజా నట్వర్ లాల్’ చిత్రాన్ని ఆగష్టు 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత హుమైమాకు ఎలాంటి అవకాశాలు వస్తాయో.. పాకిస్థాన్ లో ఈ అమ్మడికి ఎలాంటి పేరొస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles