Sanjana turns as muslim girl

Sanjjanaa to play Muslim girl, Sanjana converted into mislam girl, South film actress Sanjana exposing hot navel shows, Actress Sanjana, Sanjana Turns as Muslim girl

Sanjjanaa to play hijab-clad Muslim girl

ఈ పాపేంటీ ఇలా తయారయ్యింది

Posted: 07/09/2014 10:17 AM IST
Sanjana turns as muslim girl

పూరీ తెరకెక్కించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించిన నటి సంజన. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కూడా ఈ అమ్మడికి సరైన గుర్తింపు రాలేదు. చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అవి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయాయి. ఇక గ్లామర్ ను నమ్ముకొని చాలా సినిమాల్లో అందాల ప్రదర్శన చేసి, బికినీలు వేసి తెగ చూపించినా కూడా లాభం లేకపోయింది. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కన్నడకు మకాం మార్చింది. అక్కడ రెండు, మూడు సినిమాలు చేసి అక్కడ వివాదాల్లో చిక్కుకుంది.

ఇక అక్కడి నుంచి తాజాగా మలయాళంలోకి షిఫ్టు అయ్యింది. కానీ ఇక్కడ ఈ అమ్మడి భవిష్యత్తే మారిపోయిందని తెలిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఓ మలబారీ ముస్లిం యువతి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో సంజన ఎప్పుడూ బుర్ఖాలోనే కనిపిస్తోంది. అయితే ఈ చిత్ర విశేషాల గురించి సంజన తన అభిప్రాయాలను చెబుతూ కొన్ని ఆసక్తికరమైన అంశాలను భయటపెట్టింది. అవేంటంటే...

‘ఈ సినిమాలో ముస్లిం యువతి పాత్రలో నటిస్తున్నప్పటి నుంచి నాకు ఇస్లాం మతం గురించి, ఆచారాల గురించి బాగా తెలుసుకోవడం మొదలుపెట్టాను. అంతే కాకుండా అవి నన్ను చాలా ప్రభావితం చేస్తున్నాయి. నాకు తెలిసి నేను....’ అంటూ మొత్తం పూర్తిచేయకుండానే ఆపేసింది.  అంటే అక్కడ ‘నాకు తెలిసి నేను..... ఈ మతంలోకి మారుతున్నట్లుగా అనిపిస్తుంది.’ అని అనుకోవాలా.. మతం మారబోతున్నారా అంటే... ఓ చిరునవ్వు నవ్వు నవ్వి వెళ్లిపోయింది సంజన. మరి ఆ నవ్వుకు అర్ధం త్వరలోనే సంజన ఇస్లాం మతంలోకి మారబోతుందా అని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరగనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles