Deva katta first chance miss to akhil debut movie

deva katta first chance miss to akhil debut movie, akhil akkineni to be launched under deva katta direction, deva katta narrates a love story to akhil akkineni, nagarjuna wants deva katta to direct akhil, deva katta to direct akhil debut movie

Deva Katta First Chance Miss to Akhil debut Movie

అఖిల్ ఎంట్రీ దేవా కట్టాతో ఉండదా ?

Posted: 07/04/2014 11:09 AM IST
Deva katta first chance miss to akhil debut movie

టాలీవుడ్ లో ప్రస్థానం సినిమాతో క్రియేటివ్ అండ్ కమర్షియల్ దర్శకుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్న దర్శకుడు దేవాకట్టా అనతి కాలంలో తన దర్శకత్వ ప్రతిభతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ క్రేజ్ తోనే అక్కినేని నాగార్జున అతని చిన్న కొడుకు అయిన అఖిల్ ని అరంగ్రేటం చేయిస్తే బాగుంటుందని భావించి ఓ స్టోరీ కూడా  విన్నాడని, అఖిల్ ఎంట్రీ దేవా కట్టా దర్శకత్వంలోనే ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే అక్కినేని అఖిల్ కు ఓ లవ్ స్టోరీ చెప్పాడట. ఆ కథ అఖిల్ కు బాగా నచ్చిందట. కానీ ఇంకా ఫైనలైజ్ అవలేదంట. ఎందుకంటే అఖిల్ ఇంకా వేరే దర్శకుల రెండు, మూడు కథలు విన్నారు. కాబట్టి ఏ సినిమా ముందుగా చేస్తారో చెప్పలేను అని చెప్పుకొచ్చాడు దేవాకట్టా. ఇటీవల ఆయన తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆటోనగర్ సూర్య ’ విడుదలై  యావరేజ్ టాక్ ని సంపాదించుకుంది. దీంతో అక్కినేని నాగార్జునకు దేవాకట్టాపై ఉన్న నమ్మకడం కాస్తంత సడలిందని, ఆటోనగర్ సూర్యలో దేవా డైలాగులు, డైరెక్షన్ బాగున్నా స్టోరీలో బలం లేకపోవడం వల్లే యావరేజ్ టాక్ తెచ్చుకుందన్న భావనకు వచ్చిన ఆయన తొలి ఛాన్స్ ని దేవాకు ఇవ్వాలా ? లేదా అనే ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీలోని నాగార్జున సన్నిహితులు అంటున్నారు.

ఒకవేళ దేవాతో సినిమా చేస్తే రెండోది కానీ మూడోది కాని అవ్వచ్చిన, తొలిఛాన్స్ మాత్రం వచ్చే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. మరి ఇప్పడు అఖిల్ ని డైరెక్ట్ చేసే తొలి ఛాన్స్ ఎవరికి ఇస్తారనే దాని పై చర్చ మొదలైంది. అయితే చాలా మంది మాత్రం తొలి చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే ‘మనం ’ దర్శకుడి ఛాన్స్ రావచ్చని, మాస్ అండ్ లవ్ స్టోరీ అయితే ఈ లిస్టులోకి కొత్త దర్శకుడు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles