Samantha to romance with junior ntr for 4th time in multi starrer movie

samantha to romance with junior ntr for 4th time in multi starrer movie, samantha latest news, samantha ruth prabhu, samantha romance with junior ntr, samantha with junior ntr, samantha to romance with junior ntr, samantha in multi starrer movie, nagarjuna and junior ntr multi starrer movie

samantha to romance with junior ntr for 4th time in multi starrer movie,

పెళ్లియినా.. ఎన్టీయార్ వెంటబడుతున్న సమంత

Posted: 06/24/2014 04:00 PM IST
Samantha to romance with junior ntr for 4th time in multi starrer movie

(Image source from: samantha to romance with junior ntr for 4th time in multi starrer movie)

ఏమాయ చేసావే సినిమా ద్వారా యువకుల మనసులను దోచేసుకున్న చెన్నయ్ బ్యూటీ సమంత... టాలీవుడ్ లో వున్న హీరోయిన్లందరినీ తలదన్నేసేలా, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అంతేకాదు.. తమిళంలో కూడా దాదాపు అరడజను వరకు సినిమాలను ఒప్పుకుని తీరిక లేకుండా గడుపుతోంది. ఇంత బిజీగా వున్నప్పటికీ తాజాగా మల్టీస్టారర్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పేసుకుంది.

లేటెస్ట్ గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, ఎన్టీయర్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ సినిమాని పీవీపీ సంస్థ భారీగా నిర్మించేందుకు అన్ని సన్నాహాలను సన్నద్ధం చేసుకుంది. ఈ సినిమాలోనే జూనియర్ ఎన్టీయార్ సరసన హీరోయిన్ గా నటించేందుకు సమంత అన్ని డేట్స్ ఇచ్చేసిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయానికి సంబంధించి సమంత కూడా తాను త్వరలోనే ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నానని ప్రకటించేసింది కూడా! అయితే ఈ ప్రకటన ఇంకా అధికారికంగా విడుదల కావలసి వుంది.

గతంలో ‘బృందావనం’ సినిమాలో ఎన్టీయార్ తో జత కట్టిన సమంత... ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తరువాత ‘‘రామయ్యా వస్తావయ్యా’’ సినిమాలో కూడా జత కట్టింది. అయితే ఆ సినిమా మాత్రం కలెక్షన్ల వరకు కాస్త ఫర్వాలేదనిపించినా... ఫ్లాప్ గానే నిలిచిపోయింది. అలాగే బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘‘రభస’’ సినిమాలో కూడా ఈ యంగ్ టైగర్ తో జతకట్టిన సమంత... తాజాగా నాలుగోసారి మల్టీస్టారర్ సినిమాలో నటించబోతోంది. అయితే ఈ విషయమై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles