What is the maruti situation in tollywood

Maruti situation in Tollywood, Maruthi after Kotha Janta, Maruthi on Tollywood Movies, Maruthi with naga chaitanya, tollywood film director, Kotha Janta movie director

Maruti situation in Tollywood, Maruthi after Kotha Janta, Maruthi on Tollywood Movies, Maruthi with naga chaitanya, tollywood film director, Kotha Janta movie director

దర్శకుడు మారుతి పరిస్థితి ఏమిటి .?

Posted: 05/09/2014 12:33 PM IST
What is the maruti situation in tollywood

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలను తొక్కేస్తున్న రోజుల్లో ‘ఈ రోజుల్లో ’ సినిమా తో ముందుకు వచ్చిన దర్శకుడు మారుతి చిన్న సినిమా అంటే ఒట్టి సినిమా ఏమీ కాదని నిరూపించాడు ఆ సినిమా హిట్టుతో. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా మంచి వసూళ్ళు కూడా సాధించింది. తరువాత ‘బస్ స్టాప్, ప్రేమకథా చిత్రం ’ సినిమాలను తనదైన శైలితో తెరకెక్కించి హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని అందరి ద్రుష్టిలో పడ్డాడు.

హిట్  సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా బూతు చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్నాడు. ఈయన సినిమాలు చూసిన పెద్ద హీరోలు సైతం ఓ సినిమా చేయాలని అనుకున్నా, ఆయనకున్న బూతు బిరుదుతో వెనక్కు తగ్గారు. కానీ మెగా కంపౌండ్ బడా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో తన కుమారుడు శిరీష్ తో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సినిమా తరువాత మెగా హీరోలను డైరెక్ట్ చేయవచ్చని అనుకున్నాడు.

కానీ శిరీష్ తో చేసిన ‘కొత్త జంట ’ సినిమాను ప్రేక్షకులు ఆదరించక పోవడమే కాకుండా మారుతి ఇలాంటి చెత్త సినిమాలు కూడా చేస్తారా అనే విధంగా తీశాడు. దీంతో ఈయనకు స్టార్ హీరోలతో కాదు కదా ? ఏ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ రావడం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ తో అదే బ్యానర్లో  సినిమా చేయాలనుకున్నాడు.

అయితే, ఇప్పుడు అంత సీను కనపడకపోయేసరికి వచ్చిన ఆఫర్లను ఒప్పుకుంటున్నాడట. ఈ క్రమంలో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. హ్యాట్రిక్ విజయాల సినిమాలు అందించే సరికి మారుతిలో పస తగ్గిపోయిందో ఏమో అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles