Parvathy is kamal hassan daughter in uthama villain

Parvathy in kamal movie, parvathy kamal daughter, uthama villain

Parvathy Is Kamal Hassan Daughter in Uthama Villain,

కమల్ కూతురు శ్రుతి కాదట

Posted: 05/02/2014 10:06 AM IST
Parvathy is kamal hassan daughter in uthama villain

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రుతి హాసన్ విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు అనే విషయం అందరికి తెలిసిందే. కానీ కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ కాదట. పార్వతి అట. ఈమె ఎవరు కొత్తగా అని ఆశ్చర్యపోకండి. విషయం ఏంటంటే... కమల్ హాసన్ హీరోగా ‘ఉత్తమ విలన్ ’ అనే సినిమాను రమేష్ అరవింద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో కమల్ కి కూతురి పాత్రలో శ్రుతి హాసన్ అయితే బాగుంటుందని అనుకొని శ్రుతిని డేట్స్ అడిగితే ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కమల్ హాసన్ కి కూతురిగా నటించే ఛాన్స్ ని కోల్పోయిందట. ఈమె స్టానంలో తమిళ సినిమా ‘పూ ’ లో హీరోయిన్ గా నటించిన పార్వతి ని ఎంపిక చేశారట.

నిజ జీవితంలో తండ్రి కూతుళ్ళు అయిన వీరిద్దరు తెర పై కూడా తండ్రి కూతుళ్ళుగా నటిస్తున్నారంటే ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలయ్యారట. ఇప్పుడు శ్రుతి డేట్లు అడ్జెస్ట్ చేయలేక పోవడంతో ఆయనకు కూతురుగా కనిపించే ఛాన్స్ కోల్పోతున్నానని ఆమె కూడా ఫీలవుతోందట. అంతే గానీ శ్రుతి హాసన్ కమల్ హాసన్ కూతురేనండోయ్.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles