Young hero ram voice over in rey

Rey movie, hero Ram, Ram Potheneni, Ram voice over for Rey, Sai Dharam Tej, Rey movie release date, Chakri, YVS Choudary, Hero Ram voice over in Rey

Energetic Star Ram will be lending his voice for Sai Dharam Tej debut movie Rey.

మెగా హీరో కోసం గొంతు అరువు ఇచ్చాడు

Posted: 04/23/2014 12:25 PM IST
Young hero ram voice over in rey

టాలీవుడ్ లో పెద్ద హీరోల హవా ఎక్కువడంతో చిన్న హీరోల సినిమాలకు ఆదరణ అంతంత మాత్రమే ఉంటుంది. దీంతో దర్శక నిర్మాతలు ఆయా సినిమాలకు హైప్ తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో భాగంగా స్టార్ హీరోలను ఆడియోలకు పిలవడం, హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించడం లాంటివి చేస్తుంటారు.

గతంలో  ప్రముఖ హీరోల సినిమాల్లో క్రేజ్ నెస్ కోసం పలువురి హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించారు. పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తే, మర్యాద రామన్న, దూసుకెళ్తా చిత్రాలకు రవితేజ, రేసుగుర్రం కి సునీల్... నేపథ్య గళాన్ని అందించారు. ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరో రామ్ వచ్చి చేరాడు.

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘రేయ్ ’ సినిమాకు వైవీఎస్ చౌదరి హైప్ తీసకొని రావడానికి కొన్ని ముఖ్య సన్నివేశాలకు హీరో రామ్ తో వాయిస్ ఓవర్ చెప్పించినట్లు సమాచారం. రామ్ కి వైవీయస్ చౌదరికి మంచి స్నేహం ఉండటంతో రామ్ అడిగిన వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను  మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: యలమంచిలి గీత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles