Nayanthara out of venky pawan movie

Nayantara out of Oh My God Remake, Nayanatara quoted high remuneration for Venkatesh Pawan Kalyan Oh My God Remake, Nayanatara Pawan kalyan

Nayanthara might be part of the Telugu remake of Oh My God and she was expected to pair up with Venkatesh.

నిర్మొహమాటంగా తప్పుకుంది

Posted: 04/18/2014 07:23 PM IST
Nayanthara out of venky pawan movie

టాలీవుడ్ లో హీరోయిన్ నయనతార చాలా సీనియర్ మోస్ట్ అనే చెప్పాలి. ఈమెతో ఎంట్రీ ఇచ్చిన వారు ఇప్పుడు వెండితెర పై అవకాశాలు లేక తెరమరుగు అయ్యారు. దీంతో సీనియర్ హీరోల సరసన నటించడానికి సరైన వారు దొరక్కపోవడంతో నిర్మాతలు ఈమె వెంటే పడుతున్నారు. ఇదే సరైన టైం అని భావించిన నయన్ అందినకాడికి లాగే ప్రయత్నం చేస్తుంది.

ఈ క్రమంలోనే నయన్ కి అనుకోని షాక్ తగిలింది. టాలీవుడ్ లో వెంకటేష్, పవన్ కళ్యాణ్ తో  మల్టీ స్టారర్ సినిమాగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓమైగాడ్ ’ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకటేష్ సరసన నయనతారను తీసుకుందామనుకున్నారు. వెంకటేష్ ‘రాధా’లో నయనతారే హీరోయిన్‌. స్టోరీ సమస్యల వల్ల ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ డిలే అయ్యింది.

ఇదిలావుండగా ‘రాధా’ సినిమాకిచ్చిన కాల్షీట్లను ‘ ఓ మై గాడ్ ’కి  బదలాయించారు. దీంతో నయనతార ఆ సినిమాకు ఇచ్చే రెమ్యునరేషనే ఈ సినిమాకు ఇవ్వాలని డిమాండ్ చేసిందట. కానీ నిర్మాతలు ఈ సినిమాలో పాత్ర చిన్నదిగా ఉండటంతో అంత ఇవ్వలేని చెప్పడంతో మొహమాటం లేకుండా సినిమా నుండి తప్పుకుందని టాలీవుడ్ ఫిలిం వర్గాల సమాచారం. దీంతో మరో హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles