Movie remakes challenge to film directors

Movie remakes challenge to film directors, Sekhar Kammula Anamika movie, actress Vidya Balan, actress Nayantara

Movie remakes challenge to film directors

సినిమా రిమేక్స్ కష్టమా సులభమా?

Posted: 03/15/2014 12:42 PM IST
Movie remakes challenge to film directors

సినిమాలు ఈ మధ్య తెలుగులోంచి హిందీలోకి, హిందీలోంచి తెలుగులోకి రిమేక్స్ జరుగుతున్నాయి.  కానీ ఒరిజినల్ భాషలో విజయవంతమైన సినిమాల విషయంలో కూడా రిమేక్ ల విజయానికి హామీ లేదు.  చాలా సినిమాలు పరభాషలోకి రూపాంతరం చెంది దెబ్బతిన్నాయి.  తెలుగులో రికార్డ్ సృష్టించిన శంకరాభరణం దగ్గర్నుంచి ఎన్నో తెలుగు సినిమాలు హిందీలో విఫలమయ్యాయి.  అలాగే 3 ఇడియట్స్, వెడ్నస్ డే లాంటి హిందీ సినిమాలు కూడా తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించలేకపోయాయి. 

శేఖర కమ్ముల దర్శకత్వంలో హిందీ సినిమా కహానీ తెలుగులో అనామిక అనే టైటిల్ తో నిర్మాణం జరిగింది.  హిందీలో విద్యా బాలన్ చేసి అందరి మన్ననలనూ అందుకున్న విద్యా బాగ్చి పాత్రను తెలుగులో నయనతార పోషించింది.  నయన తార ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తుందనటంలో అనుమానమేమీ లేదు కానీ రిమేక్స్ దర్శకులకు పెద్ద సవాలే అవుతుంది. 

రిమేక్ లు ఒక విధంగా సులభమే.  ఆ సినిమాను చూపిస్తే పాత్రల గురించి ఎక్కువగా వివరించవలసిన అవసరం దర్శకుడికి తగ్గిపోతుంది.  పైగా స్క్రీన్ ప్లే కూడా రెడిమేడ్ గా దొరుకుతుంది.  కాకపోతే భాష మారినప్పుడు ప్రాంతీయత ఉట్టిపడేలా చెయ్యటంలోనే ఉంది దర్శకుడి నేర్పంతా.  అలాగని రిమేక్ లో మార్చటానికి ఎక్కువ స్వేచ్ఛ కూడా ఉండదు.  ఉన్నదాంట్లోనే అవసరమైన చోట మార్పు జరగాలి, దాన్ని ఆ భాష ప్రేక్షకులు మెచ్చుకునేట్లుగా ఉండాలి. 

అలా రిమేక్ లో విజయవంతంగా నడిచింది ఈ మధ్యకాలంలో వచ్చిన హిందీ దబంగ్ కి తెలుగు రూపాంతరం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్.
అలా, రిమేక్ లు దర్శకుడికి ఒక విధంగా సులభమైన పనే అయినా ఒక విధంగా పెను సవాల్ గా కూడా నిలుస్తాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles