Pawan to play as lord krishna role in oh my god

Pawan play lord Krishna role, Pawan Kalyan and Venkatesh multi starrer movie, Pawan Kalyan in Oh My god telugu remake, Oh My god telugu remake by Pawan kalyan

Bollywood Oh My God film and planning to remade in telugu with Venkatesh and Rajendra Prasad in lead roles.

వెంకీ - పవన్ మల్టీ స్టారర్ చిత్రం

Posted: 02/11/2014 06:25 PM IST
Pawan to play as lord krishna role in oh my god

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో మల్టీస్టారర్ చిత్రంలో కనిపించబోతున్నాడా ? అదీ కృష్ణుడు వేషంలో ? అంటే అవుననే చెబుతున్నాయి ఫిలిం వర్గాలు. ఈయన విక్టరీ వెంకటేష్ తో కలిసి తెరను పంచుకోబోతున్నాని, వెంకీ మెయిన్ రోల్ గా ‘ఓ మై గాడ్ ’ చిత్రం తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన కృష్ణుడు పాత్రలో ‘పవన్ కళ్యాణ్ ’ ని తీసుకున్నారని, దీని కోసం వెంకటేష్ ప్రత్యేకంగా పవన్ ని సంప్రదించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఇక ‘ఓ మై గాడ్ ’ చిత్ర కథ విషయానికి వస్తే...  పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి ఓ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం ప్రక్రుతి విలయానికి నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు.

అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనే కథను దర్శకుడు ఉమేష్‌ శుక్లా అద్బుతంగా తెరకెక్కించాడు. తెలుగు వెర్షన్ కి డాలీ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 సినిమా కోసం సన్నద్దం అవుతున్న పవన్ ఈ సినిమాలో చిన్న పాత్ర కావడంతో కమీట్ అయ్యాడని, గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకీతో నటించాల్సి ఉన్నా అది కుదరలేదు. 

ఈసారి అలా కాకుండా ఉండేలా చూసుకుంటున్నాడట పవన్. వెంకీ పవన్ కాంబినేషన్లో సినిమా అంటే ఇరు వర్గాల ఫ్యాన్స్ కి పండగే అన్నమాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles