Bhimavaram bullodu postponed

Bhimavaram Bullodu release postponed, Sankranthi, Jan 24th.

Till recently, it was said that comedy hero Sunil Bhimavaram Bullodu will release for Sankranthi.

భీమవరం బుల్లోడు పోస్ట్ పోన్

Posted: 01/10/2014 09:03 PM IST
Bhimavaram bullodu postponed

బడా హీరోల దెబ్బకు చిన్న హీరోల సినిమాలు విడుదల కావని మరోసారి నిరూపితం అయ్యింది. కామేడియన్ స్థాయి నుండి కష్టపడి హీరో అయ్యి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంత చేసుకున్న సునీల్ ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ‘భీమవరం బుల్లోడు ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉంటుందని ముందు అన్నారు.

కానీ మహేష్, చరణ్ లాంటి స్టార్ల సినిమాలే మొత్తం థియేటర్లను ఆక్రమించుకోవడంతో ఈ సినిమాకు థియేటర్లు దొరక్క వాయిదా వేశారని అంటున్నారు. అంటున్నారు. నేడు భారీ స్థాయిలో మహేష్ సినిమా విడుదల అయితే, మరో రెండు రోజుల్లో చరణ్ సినిమా విడుదల కాబోతుంది. ఈ సంక్రాంతికి ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలే రేసులో ఉండటంతో ఈ బుల్లోడు తప్పుకున్నట్లు చెబుతున్నారు.

ఈ సినిమాను ఈనెల 24 తేదీన విడుదల చేస్తామని నిర్మాత సురేష్ బాబు చెప్పాడు. నిజానికి సంక్రాంతికి మహేష్, చెర్రీల సినిమాలు పక్కా యాక్షన్ సినిమా కావడంతో సునీల్ కామెడీ సినిమాకు డిమాండ్ బాగానే ఉండేది. మరి ఎందుకు వెనక్కు తగ్గారో చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles