Biriyani movie hero karthi at cbcid office

Biriyani Movie hero karthi at CBCID Office, hero karthi at CBCID Office, Briyani leaked songs, Yuvan Shankar Raja, Actor Karthi ,Venkat , Biriyani Movie Team at CBCID Office

Biriyani Movie hero karthi at CBCID Office, hero karthi at CBCID Office

హీరో సూర్య తమ్ముడు కార్తీ సీబీ-సీఐడీ చేతిలో

Posted: 08/20/2013 03:16 PM IST
Biriyani movie hero karthi at cbcid office

తమిళ హీరో సూర్య తమ్ముడు హీరో కార్తీ సీబీసీఐడిని ఆశ్రయించాల్సిన పరిస్దితి వచ్చింది. కార్తీ తాజా చిత్రం 'బిరియానీ' చిత్ర బృందానికి ఇంటర్నెట్ దెబ్బ తగిలింది. చిత్రం ఆడియో ఆవిష్కరణ కాకముందే ఆ చిత్రంలోని అన్ని పాటలు ఇంటెర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండడంతో షాక్ అయిన యూనిట్ సీబీసీఐడీని ఆశ్రయించింది. నటుడు కార్తీ, హన్సిక జంటగా నటిస్తున్న 'బిరియానీ'చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సక్సెస్‌ఫుల్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్‌రాజా చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం యువన్ శంకర్‌రాజాకు 100 వ చిత్రం కావడంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా సంగీతాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 31న యువన్ పుట్టినరోజు కావడంతో అదే రోజున ఆడియోను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో బిరియానీ చిత్రంలోని ఎనిమిది పాటలు దర్శనమివ్వడంతో దిక్కుతోచని చిత్ర బృందం స్థానిక గిండీలోని సీబీసీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. చిత్ర హీరో కార్తీ, దర్శకుడు వెంకట్‌ప్రభు, నిర్మాత జ్ఞానవేల్‌రాజా, నటుడు ప్రేమ్‌జీ, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాలు సీబీసీఐడీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles