Attarintiki daredi movie release postponed

attarintiki daredi movie release postponed, attarintiki daredi movie release date, attarintiki daredi movie in trouble with telangana state

attarintiki daredi movie release postponed, attarintiki daredi movie release date, attarintiki daredi movie in trouble with telangana state

వాయిదాల దారిలోనే పవన్ అత్తారిల్లు

Posted: 08/02/2013 10:31 AM IST
Attarintiki daredi movie release postponed

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం విడుదల పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 7న విడుదల చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.   అయితే సీమాంధ్రలో బంద్ లు, నిరసన జ్వాలల నేపథ్యంలో ఈ చిత్రం ప్రకటించిన తేదీన విడుదల అవుతుందా ? లేక వాయిదా పడుతుందా ? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంత వరకు ఏ ప్రకటన రాలేదు. మొదట రామ్ చరణ్ సినిమా కూడా టైంకి విడుదల అవుతుందని చెప్పి, తీరా వాయిదా వేశారు. ఇప్పుడు పవన్ సినిమా కూడా అదే దారిలో వెళుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే , కేంద్ర మంత్రి అయి ఉండి విభజన చేస్తున్న సమయంలో చిరు ఏమీ చేయలేక పోయాడనీ, చిరంజీవి పక్కా పదవులకు ఆశపడే మాట్లాడలేదనే ఆగ్రహంతో ఉన్న సీమాంధ్రులు మెగా ఫ్యామిలీ హీరోల చిత్రాలను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి నేపథ్యంలో చిత్రాన్ని విడుదల చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుందనే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సినిమా ముందు రోజు వరకు కొనసాగితే విడుదల కష్టమే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles