Maruti sold rights of prema katha chitram in three languages

maruti earned huge profits by remake rights also, maruti next movie romance,maruti,prema katha chitram,prema katha chitram remake rights,romance

Maruti sold rights of Prema Katha Chitram in three languages Kannada.

రీమేక్ రైట్స్ కి భారీ రేటు

Posted: 07/01/2013 08:54 PM IST
Maruti sold rights of prema katha chitram in three languages

దర్శకుడు దాసరి మారుతి నిర్మాతగా మారి, దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టి జె. ప్రభాకర్ రెడ్డి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ప్రేమకథా చిత్రమ్. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు 8 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులు భారీ రేటుకు అమ్మడు పోయాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమా టాక్ ని, రాబట్టిన కలెక్షన్లు చూసి ఈ సినిమాను ఎలాగైనా దక్కించుకోవాలని పలువురు నిర్మాతలు పోటీపడ్డారట. దీంతో ఈ సినిమా రేటు అమాంతం పెరిగిపోయిందట. ఈ సినిమాని కన్నడ, తమిళ, హిందీ భాషల్లో అనువాదం చేసేందుకు కొంతమంది ముందుకొచ్చారు. కన్నడలో భారీ మొత్తాన్ని ఇచ్చి మరీ హక్కులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అతి తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా నిర్మాతకు ఐదు రెట్ల లాభాన్ని తెచ్చిపెట్టిందని సినీ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles