Pawan ram charan arjun multi starrerin talk

pawan kalyan, ram charan teja, allu arjun, multi starrer movie, Mega family multi starrer movie

I would love to work with my cousin(Allu Arjun) and uncle(Pawan Kalyan) in a good movie. If a script comes our way, that excites all three of us, then most definitely we will do so. But none of us are searching for a script of that kind. We are in no hurry Ram Charan told.

మెగా ఫ్యామిలీ మెగా మల్టీ స్టారర్

Posted: 06/22/2013 11:31 AM IST
Pawan ram charan arjun multi starrerin talk

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓ ఆంగ్ల మేగజైన్ తో మాట్లాడుతూ చేసిన కొన్ని వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల ఊపు మొదలైంది. ఇలాంటి తరుణంలో ఈయన చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఆ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... బాబాయ్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌‌తో కలిసి ఓ మంచి సినిమాలో నటించాలని ఉంది. ముగ్గురికీ నచ్చే విధంగా స్క్రిప్టు దొరికితే తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పుడు ఆప్రత్నాలు ఏమీ చేయడం లేదు. ఇప్పుడే చేయాలనే తొందర కూడా లేదు' అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా నన్ను బాబాయ్ తో పోల్చవద్దని ఆయన స్థాయి వేరని, నేనెప్పుడు ఆయన్ను చేరుకోలేనని, నేను కూడా ఆయనకు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. చరణ్ ఇలా మాట్లాడటం చూస్తుంటే.. త్వరలో టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ మల్టీ స్టారర్ సినిమా రాబోతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఈ ముగ్గురు హీరోలు కలిసి నటించబోతున్నారనగానే వార్త మెగా అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా ఆసక్తి రేపుతుంది. మరి ఇది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles