Rajinikanth to work with shankar once again

Rajinikanth, Shankar, Madhuri Dixit, director shankar, robo director shankar, shankar new movie, shankar latest movie,

Now, buzz is that the superstar will be working with director Shankar of Robot fame. Reports have emerged that Shankar has narrated the storyline to Rajni and even got his approval. If the buzz is true, then it would be the director-actor's third venture after blockbusters Sivaji and Endhiran.

శంకర్ - రజినీ కాంబినేషన్ మళ్లీ రిపీట్

Posted: 06/21/2013 12:32 PM IST
Rajinikanth to work with shankar once again

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు వసూళ్ళ పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే ఆ క్రేజే వేరు. ప్రస్తుతం ఆరోగ్యం సహకరించక సినిమాల్లో నటించడం తగ్గించిన రజినీ కాంత్ ప్రస్తుతం తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడయాన్ ’ అనే సినిమాలు నటిస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే తమిళ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం శంకర్ - రజినీ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుదని, రజినీ కూడా శంకర్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తితో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ ‘ఐ ’ సినిమాతో బిజీగా ఉన్న శంకర్ తన తరువాత ప్రాజెక్టును రజినీతో చేయడానికి రెఢీగా ఉన్నాడట. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ‘రోబో ’. ఆ సినిమా విడుదల తరువాత దీనికి సీక్వెల్ వస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఒకవేళ అన్నీ అనుకూలిస్తే శంకర్ ఈయనతో రోబో సీక్వెల్ తీస్తాడా ? లేక కొత్త స్టోరీతో మన ముందుకు వస్తాడో చూడాలి. ఏది ఏమైనా మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు మాత్రం పండగే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles