Rajamouli playing pivotal role bahubali

rajamouli, rana, prabhas, bahubali, raghavendra rao,

Filmnagar source said that, Director Rajamouli would be facing the camera for a special sequence in his next biggie 'Baahabali' and the mustache is for the same. It would be great to see the most successful director playing a pivotal role in his flick.

రాజమౌళి నటించబోతున్నాడు

Posted: 05/21/2013 10:37 AM IST
Rajamouli playing pivotal role bahubali

ఇంత వరకు ఓటమి అంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తెర వెనుక మాత్రమే ఉంటాడు. కానీ ఆయన కూడా తెర పై కనిపిస్తే.... హీరో తో పాటు సినిమాలో కీలక సన్నివేశాలు పోషిస్తే....ఆయన అభిమానులకు పండగే పండగ. త్వరలోనే అలాంటిది వెండితెర పై జరగబోతుంది. రాజమౌళి తొలి సారిగా ముఖానికి రంగేసుకొని వెండితెర పై కనిపించేందుకు రెఢీ అయ్యాడు. ఆయన తాజాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘మహాబలి ’ సినిమాలో ఓ పాత్రను పోషించబోతున్నాడని సమాచారం. దానికి కోసం ఆయన కొత్త లుక్ తో దర్శనం ఇస్తున్నాడు. పైన కనిపిస్తున్న ఫోటో అదే. ఇక ఈయనలో గొప్ప నటుడు కూడా ఉన్నాడని గతంలో చాలా మంది హీరోలు కూడా చెప్పారు. ఈయన దర్శకత్వం వహించిన సినిమాలోని కొన్ని సీన్లను సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు ‘మహాబలి ’లో తాను కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడట. మరి తొలిసారి నటుడిగా మారుతున్న దర్శక ధీరుడు ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళేందుకు సిద్ధం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles