Bahubali star hunt auditions shocked rajamouli

Bahubali, Auditions, Rajamouli, junior artists, prabhas,

Bahubali Star Hunt Auditions Shocked Rajamouli.

ఈయనకు భయపడి పోయారా ?

Posted: 04/15/2013 09:20 PM IST
Bahubali star hunt auditions shocked rajamouli

ఇంత వరకు అపజయం అంటూ ఎరుగకుండా టాలీవుడ్ లో తన హవాని కొనసాగిస్తూ, దర్శక ధీరుడుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి సినిమాలో నటించడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆయన సినిమాలో అవకాశం వచ్చిందంటే మాత్రం వదులుకోరు. కానీ వచ్చిన అవకాశాన్నే కాదన్నారట. వారు పెద్ద స్టార్స్ కూడా కాదు. అసలు విషయానికి వస్తే... జక్కన్న తాజాగా భారీ బడ్జెట్ తో ‘బహుబళి ’ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించడానికి స్వయంగా రాజమౌళే నటులు కావాలని ప్రకటించాడు. దీంతో తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి వేల సంఖ్యలో ధరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాజమౌళి వారికి పరీక్షల మీద పరీక్షలు పెట్టి చివరికి యాభై మందిని ఎంపిక చేసుకున్నాడు. వారికి శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేశాడు. ఒకరి రెండు రోజులు శిక్షణ కోసం బాగానే వచ్చిన ఆ ఆర్టిస్టులు మూడో రోజు నుండి రావడం మానేశారట. దీనికి రాజమౌళికి కారణాలు ఏంటో అర్థంకావడం లేదట. అయితే సినీ జనాలు మాత్రం రాజమౌళి చాలా విసిగిస్తున్నాడని అందుకే వారు బంద్ అయ్యారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles