Ramcharan and jr ntr with mirchi director

ramcharan, jr ntr, mirchi director, koratala shiva, bandla ganesh, dvv danaiah, prabhas movies, mirchi movie, writer koratala shiva, ramcharan siva combo, ntr siva combo

ramcharan and jr ntr with mirchi director

11.gif

Posted: 02/13/2013 11:35 AM IST
Ramcharan and jr ntr with mirchi director

       ఇన్నాళ్ళూ రచయితగా వున్న శివ, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారి, తొలి చిత్రాన్నే పెద్ద హిట్ చేసుకున్నాడు. దాంతో, రాత్రికి రాత్రే అతని స్థాయి పెరిగిపోయింది. స్టార్ హీరోలంతా అతనితో చేయడానికి koratala-shivaeఆఫర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో శివ రెండు సినిమాలు అంగీకరించినట్టు సమాచారం. వీటిలో బండ్ల గణేష్ నిర్మించే సినిమా మొదటిది. ఇందులో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ కలిసి నటిస్తారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. కేవలం చరణ్ మాత్రమే నటిస్తాడని ఇప్పుడు తెలుస్తోంది. మే 15 న దీనిని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
        కాగా,  ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమాకి కూడా శివ దర్శకత్వం వహించడానికి అంగీకరించాడు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తారట. ఇలా ఏక్ ధం ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలను అందుకుని, శివ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడన్నమాట.  
        ఈ బంపరాఫర్ల సంగతిలాఉంటే,  మిర్చి'తో విజయాన్ని అందించిన కొరటాల శివతో మరో సినిమా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అయితే ఈసారి 'మిర్చి'లా ఘాటైన యాక్షన్ సినిమా కాకుండా హృద్యమైన ప్రేమ కథతో వస్తానంటున్నాడు. అంతేకాదు.. నాకు నమ్మకముంది. శివ లవ్ సబ్జెక్ట్ ను చక్కగా తెరకెక్కించ గలడనుకుంటున్నా. అన్ని అంశాలపైనా అతనికి పట్టు ఉంది. అందుకే శివకు మరో చాన్స్ ఇస్తున్నా అంటున్నాడు ప్రభాస్ మొత్తానికి కొరటాల సుడి బాగానే తిరిగింది మిర్చి సినిమాతో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shadow movie audio function
Koratala siva to direct ram charan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles