Priyamani latest film chandi shooting

priyamani, actress priyamani, priyamani chandi, chandi movie, priyamani charulata, priyamani latest film chandi, film news, movie news

priyamani latest film chandi shooting

19.gif

Posted: 02/02/2013 05:42 PM IST
Priyamani latest film chandi shooting

c

      జాతీయ ఉత్తమ నటిగా పేరు సాధించిన ప్రియమణి  మహిళా ప్రధానపాత్రలో తన సత్తా చాటుతోంది. తాజాగా ‘చండీ’ అనే మరో చిత్రంలో నటిస్తోంది. 'ది పవర్‌ ఆఫ్‌ వుమన్‌' అనేది ఉపశీర్షిక. వి.సముద్ర దర్శకుడు. జి.జగన్నాథరాయుడు సమర్పణలో ఒమిక్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై డా. జి. శ్రీనుబాబు నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దాసరి నారాయణరావు క్లాప్‌ కొట్టగా, డి.రామానాయుడు కెమేరా స్విచ్చాన్‌ చేశారు. హీరో సునీల్‌ గౌరవదర్శకత్వం వహించారు.
          'మరో ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నా. ఒక సామాన్యురాలు మంత్రిగా ఎలా ఎదిగింది? అనేది కథాంశం. మూడు భిన్నమైన కోణాలు నా పాత్రలో కన్పిస్తాయి' అని ప్రియ చెబుతోంది. దర్శకుడు మాట్లాడుతూ.. ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) నేపథ్యంలో సాగే కథాంశమిది. కథనం ఉత్కంఠకలిగించేలా ఉంటుంది. ప్రియమణి పాత్ర హైలైట్‌. మూడు షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తిచేసి మేలో విడుదలచేస్తాం అని అన్నారు. ఆరునెలలు శ్రమించి తయారుచేసిన కథ ఇది. కథాంశం ఆసక్తి రేకెత్తిస్తుంది. ప్రియమణి కథ విన్నవెంటనే ఓకే చేశారు. ఆమెకు జోడీగా ప్రముఖ నటుడు నటించనున్నాడని నిర్మాత తెలిపారు.
          నాగేంద్రబాబు, వినోద్‌కుమార్‌, పోసాని కృష్ణమురళి, ప్రభు, సుప్రీత్‌, కళాభవన్‌మణి, అలీ, ఎం.ఎస్‌. నారాయణ తదితరులు నటించనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag son akhil hero entry
Punnamiratri movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles