నేడే విడుదలైన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. http://www.teluguwishesh.com/teluguhome/200-movie-reviews/41388-seetamma-vakitlo-sirimalle-chettu-movie-review.html
ఇది నిన్నటిమాట : ప్రపంచవ్యాప్తంగా సీతమ్మ వాకట్లో సిరిమల్లె చెట్టు’ హడావుడి మొదలైపోయింది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. పూర్తి కుటుంభ వాతావరణంలో తెరకెక్కిన భారీ ఈ భారీ మల్టీ స్టారర్ కు రికార్డ్ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమాకి టికెట్లు ఇప్పటికే అన్ని ఎరియాల్లోనూ కొన్ని రోజులకి అమ్ముడుపోయాయి. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల రేర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఇప్పటికే బిగ్ హిట్ అయ్యింది. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం.
ఇదంతాఒకెత్తయితే, యూత్ ఐకాన్ మహేష్ బాబు ఓ పక్క, మరోపక్క ఫ్యామిలీ హీరో వెంకటేష్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాను తొలి రోజే చూడడానికి చాలా మంది ఉత్సాహపడుతున్నారు. ఈ సినిమా టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. IAS, IPS ఆఫీసర్లతో బాటు పలువురు రాజకీయనాయకులు కూడా ఈ టికెట్ల కోసం పైరవీలు చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పెద్ద విశేషం ఏంటంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేషీనుంచి కూడా ఈ సినిమా టికెట్ల కోసం నిర్మాతకు ఒత్తిడి వస్తోందని సమాచారం.
మరోవైపు ఈ సినిమా ఓవర్సీస్ ప్రింట్స్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ద్వారా గమ్యస్థానాలకు చేరిపోయాయి. విదేశాల్లో దాదాపు 100కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకి కక్రేజ్ చాలా ఎక్కువ ఉండటంతో టిక్కెట్లు అక్కడకూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని వెల్లడి. ఈ మూవీ ఫుల్ సాంగ్స్ జ్యూక్ బాక్స్ మీకోసం..
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more