Happy birthday to young hero ram

happy birthday to young hero ram

happy birthday to young hero ram

7.gif

Posted: 05/15/2012 01:16 PM IST
Happy birthday to young hero ram

ram_birtcc


     raeeయంగ్ హీరో రామ్ ఇవాళ కొత్త వసంతంలోకి అడుగుపెట్టారు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని చేసిన సినిమాలన్నింటిలో మెప్పించిన ఈ యంగ్ హీరో కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. తన కో-స్టార్స్ తో పాటు అభిమానులు సోషల్ నెట్ వర్క్ సైట్స్ ద్వారానూ, స్వయంగానూ రామ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. తన బర్త్డే సందర్భంగా రామ్ తన మనసులోని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ద్వారా తొలిసారిగా తమిళ ప్రేక్షకులకు పరిచయం కాబోతుండటం ఈ బర్త్డే ప్రత్యేకమన్నారు రామ్.
      ప్రస్తుతం కరుణాకరణ్ దర్శకత్వంలో 'ఎందుకంటే ప్రేమంట' చిత్రాన్ని పూర్తి చేసిన ఈ యువ కథానాయకుడు త్వరలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం బొమ్మరిల్లు చిత్రం లానే ప్రేమ, కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో నూతన తార శుభపు హీరోయిన్ గా నటించబోతోంది. కాగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాను చేస్తున్న చిత్రం గురించి అంతా 'కందిరీగ' కు సీక్వెల్ అనుకుంటున్నారనీ, అయితే అది ఎంత మాత్రం వాస్తవం కాదనీ రామ్ స్పష్టం చేశాడు. ఇది మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చెప్పాడు.
      తనదైన శైలిలో తెలుగు చిత్ర సీమలో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో మరెన్నో పుట్టిన రోజులు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆంధ్రావిశేష్.కాం కూడా ఆకాంక్షిస్తోంది. హ్యాపీ బర్త్డే రామ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh director harish shankar remuneration
Raviteja forthcoming movie daruvu release on may 25th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles