Superstar mahesh babu new movie starts today

superstar mahesh babu new movie starts today

superstar mahesh babu new movie starts today

15.gif

Posted: 04/23/2012 03:08 PM IST
Superstar mahesh babu new movie starts today

             mahesh-kajal-sukumar380 'బిజినెస్ మేన్' తర్వాత మహేష్ బాబు, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగు ఈరోజు హైదరాబాదులో ప్రారంభమైంది. సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరు గతంలో మహేష్ బాబుతో ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
             అన్నపూర్ణా స్టూడియో ఏడెకరాల స్థలంలో కోటిన్నర ఖర్చుతో వేసిన ప్రత్యేకమైన సెట్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ ర్యాక్ సాంగ్ ను కంపోజ్ చేశాడు. మహేష్ బాబు, వందలాది మంది డ్యాన్సర్లపై షూట్ చేస్తున్న ఈ పాటకు ప్రేమ రక్షిత్ నృత్యాలు సమకూర్చుతున్నాడు. నాలుగు రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. గోవా నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది.sukumar
                  కాగా, ఈ సినిమాకి 'చంద్రుడు' అనే టైటిల్ ని అనుకున్నట్లు నిన్న మొన్నటి దాకా ఫిల్మ్ నగర్ లో వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'ఆగడు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 'దూకుడు' సినిమా అఖండ విజయాన్ని సాధించడంతో, 'డు' సెంటిమెంట్లో నుంచి 'ఆగడు' అవతరించి ఉంటుందని భోగట్టా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raviteja amala paul new movie
Music director manisharma gives music for pawan forth coming film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles