Great actress soundarya memories

great actress soundarya memories

great actress soundarya memories

9.gif

Posted: 04/17/2012 04:30 PM IST
Great actress soundarya memories

              sout_333 బగవంతునికి ముందే తెలుసుకదా.. అందుకే ఆమెను అంత త్వరగా అందరికీ పరిచయం చేసేసి, మనసుల్లో నింపేసి తన వద్దకు తీసుకుపోయాడు. ఆమె మరెవరో కాదు సినీ వినీలాకాశాన మెరుపులా మెరిసిన సౌందర్య.  అసలు పేరు సౌమ్య ...  'మనవరాలి పెళ్లి' చిత్రం ద్వారా తెలుగుతెరకి పరిచయమైంది.  ఆ తరువాత వచ్చిన 'అమ్మోరు' సినిమా ఆమె అందగత్తెనే కాదు,  అసమానమైన నటి కూడా అని నిరూపించింది. జయసుధ ... విజయశాంతి తరువాత ఆ స్థాయి నటనని ప్రదర్శించిన ఆమెకి తెలుగు చిత్ర సీమ దాసోహమైంది. sou1111
               దీంతో సౌందర్యకి అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. 'చూడాలని వుంది' ... 'టాప్ హీరో' ... 'హలో బ్రదర్' ... ' పవిత్ర బంధం' ... 'ఇంట్లో ఇలాలు - వంటింట్లో ప్రియురాలు' ... 'పెదరాయుడు' ... 'దొంగాట' ... 'అంత:పురం' ... 'రాజేంద్రుడు - గజేంద్రుడు' ... ఇలా అగ్ర కథానాయకులందరి జోడీగా ఆమె ఇమిడిపోయింది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తోనూ ... బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ తోను నటించి తనదైన ప్రత్యేకతని ఆమె చాటుకుంది. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారంటే ఆమె క్రేజ్ - ఇమేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.             

              టాలెంట్ ఉండాలే గాని ఎక్స్ పోజింగ్ తో పనిలేదనే మాటకి చివరివరకూ కట్టుబడి, పన్నెండేళ్ల పాటు తిరుగులేని కెరియర్ ని కొనసాగించింది. అంతేకాదు రాజకీయాల్లోనూ తన దైన స్థానాన్ని సంపాదించుకునే వేళ 2004 సంవత్సరంలో ఇదే రోజున  పరలోకాలకు పయనమైపోయింది. ఇవాళ వర్ధంతి సందర్భంగా  సౌందర్యానురాగాల్ని మనసారా స్మరించుకుంటుంది ఆంధ్రావిశేష్.కాం

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero siddharth birth day story
Is actress aishwarya roy far away from screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles