Mega star chiranjeevi

mega star, chiranjeevi ,is the, roll model, for me ,said comedy actor turns, hero sunil

mega star chiranjeevi is the roll model for me said comedy actor turns hero sunil

13.gif

Posted: 01/31/2012 04:35 PM IST
Mega star chiranjeevi

          chiru మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుత శక్తి అంటున్నాడు హీరోగా మారిన కామెడీ నటుడు సునీల్. ఆయన నాలాంటి ఎందరో నటులకు ఆదర్శప్రాయుడన్నారు. సునీల్ హీరోగా నటించి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న పూలరంగడుసినిమాలో అతని డ్యాన్సుల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు చిరంజీవి గారి క్రమశిక్షణ, వినయ విధేయతలు అందరికీ ప్రేరణ అన్నడు సునీల్. టాలీవుడ్ లో చిరంజీవి గారిది ఒరిజినల్ డాన్స్ అనీ మేము ఆయనకి నకళ్లు లాంటి వాళ్ళమని అభిప్రాయపడ్డాడు.

        sunil కాగా, యాక్షన్ ఎంటర్టైనర్ పూలరంగడులో సునీల్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ దఫా యాక్షన్ హీరోగా కనిపించటమే కాదు, తన నాట్య ప్రతిభతో కొత్త కొత్త డ్యాన్సులు చేయబోతున్నాడు. ఈ చిత్రంలో సునీల్ డాన్స్ అద్భుతంగా చేసాడని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. తన గత చిత్రాలు ‘మర్యాద రామన్న’, ‘అందాల రాముడు’ కంటే డాన్సులు బాగా చేసినట్లు సునీల్ సైతం చెబుతున్నాడు.

         పూలరంగడు చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం వీరభద్రం కాగా కె. అచ్చిరెడ్డి నిర్మాత. సునీల్ కి జోడీగా ఇషా చావ్లా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej
Big tollywood producer bandla ganesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles