జియో 4జీ మొబైల్ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగంలో ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కుదుపేసిన రిలయన్స్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇటు డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు చేస్తూనే.. అటు రిగింగ్ బెల్స్ ప్రకటించిన ఫ్రీడమ్ ఫోన్ తరహాలో సరికోత్త 4జీ ఫోన్లను అత్యంత చౌకైన ధరకు అందించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే ఏడాది కేవలం వెయ్యి రూపాయలకే అన్ని ఫీచర్లు వున్న 4జీ ఫోన్ ను అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకున్నా.. సంస్థ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ విషయాలు తెలిసాయి. జియో టీవీతో ప్రస్తుతం ఉన్న డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ కంపెనీలకు షాక్ ఇవ్వనుంది. హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ తో ఒక జీబీపీస్ వరకు ఇంటర్నెట్ అందించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కేబుల్స్ వేసింది. పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలను రిలయన్స్ అందిస్తోంది.
అయితే ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తోందా, లేదా అనేది వెల్లడికాలేదు. డీటీహెచ్, బ్రాడ్ బ్రాండ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు జియో సేవలు కూడా అందించాలని రిలయన్స్ యోచిస్తోంది. వీటికి సంబంధించిన సెట్ అప్ బ్యాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ అందించి నిరాంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ కల్పించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేకుండా 4కే వీడియోలు వీక్షించే అవకాశం కలుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more