'One-eyed king' phrase taken out of context: Raghuram Rajan

Rajan asks apology for one eyed king comment a note of caution too

Raghuram Rajan, rbi governer, Indian economy,Arun Jaitley,Nirmala Sitharaman, appologise, economy, 'one-eye king' comment, blind people

Rajan's remark - "I think we have still to get to a place where we feel satisfied. We have this saying - 'in the land of the blind, the one-eyed man is king'. We're a little bit that way" - had raised eyebrows among central ministers.

ఆర్థిక పరిస్థితిపౌ భావన చెప్పాడు.. ఆనక క్షమాపణలు కోరాడు

Posted: 04/20/2016 06:16 PM IST
Rajan asks apology for one eyed king comment a note of caution too

భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ ముక్కుసూటి స్వభావం కలిగిన అధికారి. ఆయన డొంకతిరుగుడు లేని త్తత్వమే ఆయనకు ఇన్నాళ్లుగా విజయాలను అందించింది, అయితే దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ది రేటు ఎలా వుందన్న విషయమై ఉపమానం చెప్పిన ఆయన ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆయన కేవలం తనలోని భావనను మాత్రమే చెప్పాడని పలువురు ఆర్థిక వేత్తలు సర్థిపుచ్చగా, మరికోందరు మాత్రం రఘురామ్ రాజన్ ప్రజల్లోని ఓ వర్గం వారిని అవమానించారంటూ విమర్శలు సంధించారు.

దీంతో దిగివచ్చిన ఆయన బహిరంగంగా క్షమాపణలు కోరాడు. అసలు అత్యంత ఉన్నత స్థఆయి అధికారిగా కొనసాగుతున్న ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో తెలుసా..? భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా వుందన్న మీడియా వర్గాల ప్రశ్నకు ఆయన సమాధానంగా 'ఒంటి కన్ను రాజు' పాలన ఎలా వుంటుందో అలానే వుందని  పోల్చారు. ఆయన ఈ విధంగా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో రఘు రామ్ రాజన్ క్షమాపణలు చెప్పారు.

తన మాటలు ఎవరినైనా బాధపెట్టి వుంటే క్షమించాలని ఆయన కోరారు.  తాను అలాంటి పోలిక చేసి ఉండాల్సింది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రజల మనోభావాలను, ముఖ్యంగా అంధులను గాయపర్చినందుకు  మన్నించాల్సిందిగా కోరారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలా ఉండగా మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి చెప్పేందుకు మాత్రమే తాను అలా పోల్చానని, కానీ అలా మాట్లాడాల్సింది కాదని రాజన్ తెలిపారు. తన  వ్యాఖ్యలతో జనాభాలోని  ఒక వర్గం(అంధులు) వారిని గాయపర్చినందుకు క్షమించాల్సిందిగా ఆయన కోరారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram rajan  appologise  economy  'one-eye king' comment  blind people  

Other Articles