Lenovo and oppo launch new model smart phones

Lenovo and oppo launch new model smart phones

Oppo, Lenovo, Smart Phones, Smart Mobiles, New smart Phones, Mobiles, New Model Smart Mobiles

Famous Lenova and oppo launch new smart mobiles in to the market. Lenovo launch Atum 2X and Vibe S1. Oppo also launch A33 model

అదిరిపోయే పీచర్స్ తో మూడు స్మార్ట్ ఫోన్లు

Posted: 11/23/2015 04:53 PM IST
Lenovo and oppo launch new model smart phones

మార్కెట్లోకి కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లో అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ లో కొత్త మొబైల్స్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. తాజాగా లినోవా, అప్పోల నుండి మూడు మొబైల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. బడ్జెట్ లో ఉండే లెనోవా మొబైల్ తో పాటుగా రెండు ఫ్రంట్ కెమెరాలతో వచ్చిన లెనేవో వైబ్ ఎస్1 మార్కెట్లో సందడి చెయ్యనున్నాయి. ఈ మూడింటి పూర్తి వివరాలు మీ కోసం

లెనోవా వైబ్ ఎస్1:
దేశీయ మార్కెట్‌లోకి లెనోవో సంస్థ 'వైబ్ ఎస్1' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా లభ్యమవుతోంది. కర్వ్‌డ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు దీంట్లోని ప్రత్యేకతలు.  ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 మెగాపిక్సల్ ప్రైమరీ ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 64 బిట్ 1.7 జీహెచ్‌జడ్ మీడియాటెక్ ఎంటీ6752 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెరల్ వైట్, మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ధర 15,999 మాత్రమే

 లెనోవా ఆటమ్ 2ఎక్స్:
'ఆటమ్ 2ఎక్స్' పేరిట లావా సంస్థ దేశీయ మార్కెట్‌లోకి తక్కువ బడ్జెట్‌లో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 480X854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్ 4.0, వైఫై, ఎ-జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర 4,499 మాత్రమే.

అప్పో ఎ33:
అప్పో సంస్థ 'ఎ33' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ ఈ నూతన మోడల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, కలర్ ఓఎస్ 2.1 స్కిన్, 5 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540X960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, ఎ-జీపీఎస్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర 15,500 మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo  Lenovo  Smart Phones  Smart Mobiles  New smart Phones  Mobiles  New Model Smart Mobiles  

Other Articles