Samsung electronics launch galaxy note edge with curved screen

Samsung Electronics, Galaxy Note Edge, Galaxy Note curved screen Edge, Galaxy Note Edge curved screen, Samsung Electronics launch Galaxy Note Edge, Galaxy Note Edge price India, Samsung Galaxy Note Edge cost, Samsung Galaxy Note Edge features, Samsung Note Edge price India, samsung edge price Rs 64,900,

Samsung Electronics has announced the launch of the Galaxy Note Edge, the one with a curved screen on the side

భారతీయ విఫణిలోకి సామ్ సంగ్ గాలక్సీ నోట్ ఎడ్జ్..

Posted: 12/24/2014 06:22 PM IST
Samsung electronics launch galaxy note edge with curved screen

ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజం సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ తన నూతన గాలక్సీ నోట్ ఎడ్జ్ ను ఇవాళ అవిష్కరించింది. గాలక్సీ నోట్ 4 ను అవిష్కరణ తరువాత నుంచి ఈ ఫోన్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నప్పటికీ ఇవాళ తన గాలక్సీ నోట్ ఎడ్జ్ ను భారతీయులకు అందుబాటులోకి తీసుకోచ్చింది. దీనిలో స్ర్కీన్ వక్రంగా వుండటం మరో విశేషం. దీనిని 64 వేల 900 రూపాయలకు భారత కస్టమర్లకు సామ్ సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన కొన్ని రీటైల్ అవుట్ లెట్లలో మాత్రమే దీనిని విక్రయించనుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి అమ్మాకాలను సాగించనున్నట్లు సమాచారం.

గాలక్సీ నోట్ తరహాలోనే నోట్ ఎడ్జ్ కు కడా ప్రత్యేక హార్డవేర్ ప్రత్యేకలు వున్నాయి. సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ లలో వినియోగించే స్నాప్ డ్రాగన్ 805 ప్రాసెసర్ నే నోట్ ఎడ్జ్ లోనూ వినియోగించారు. 3 జిబి రామ్, 32 జిబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ (మెమరీకార్గులో 64 జీబీ వరకు పెంచుకునే సౌలభ్యం వుంది) , 16 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు ముందు 3.7 మెగా పిక్సెల్ కెమెరాలను నోట్ ఎడ్జ్ లో పొందుపర్చారు. కాగా నోట్ కు నోట్ ఎడ్జ్ మధ్య వత్యాసమంతా స్క్రీన్ లోనే వుంది. నోట్ కన్నా ఎడ్జ్ ఓ మాదిరిగా అకారంలో చిన్నదే. నోట్ లో  5.7 ఇంచ్ స్ర్కీన్ వుండగా, ఎడ్జ్ లో 5.6 స్ర్కీన్ మాత్రమే వుంది. అయితే ఎడ్జ్ లో కుడి బాగాన చివరకు స్క్రీన్ వక్రంగా కిందకు వచ్చేమాదిరిగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో కస్టమర్లు తరచు వినియోగించే యాప్ లతో పాటు, దానిని నోటిఫికేషన్ ప్యానల్ మాదిరిగా కూడా వినియోగించుకనే సౌలభ్యాన్ని సామ్ సంగ్ కల్పించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung Electronics  Galaxy Note Edge  curved screen  

Other Articles