Microsoft to buy minecraft

Minecrat Microsoft Mojang Stockholm developers iOS Google's Android Microsoft Minecraft

Tech giant Microsoft has agreed to buy Stockholm based developer that created 'Minecraft

మైన్ క్రాఫ్ట్ గేమ్ ను కొనుగోలు చేసిన మైక్రోసాప్ట్

Posted: 09/16/2014 01:33 PM IST
Microsoft to buy minecraft

సాఫ్ట్ వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త అధ్యయనానికి తెరలేపింది. ఇన్నాళ్లు  కేవలం సాప్ట్ వేర్ రంగంలోనే పట్టుసాధిస్తూ నెంబర్ వన్ స్థానంలో నిలిచిన మైక్రోసాప్ట్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే నోకియా మోబైల్ ఫోన్ల సంస్థను కొనుగోలు చేసిన మైక్రోసాప్ట్.. తాజాగా ప్రపంచవ్యాప్తంగా పరిచయమైన మైన్ క్రాఫ్ట్ గేమ్ ను కూడా కోనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. మైక్రోసాప్ట్ సీఈఓగా సత్య నాదేళ్ల రావడంతో.. సంస్థను కొత్త పుంతలు తొక్కించడంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. సుమారు రెండున్నర బిలియన్ అమెరికా డాల్లర్ల ( మన కెరెన్సీలో సుమారు 15 వేల 28 కోట్ల )తో ఈ గేమ్ ను సొంతం చేసుకునేందుకు అంగీకారం కుదిరింది.

పిల్లలాడుకునేందు తల్లిదండ్రులు అనుమతించే గేమ్ మైన్ క్రాఫ్ట్ ఒక్కటే

ప్రపంచవ్యాప్తంగా పిల్లలాడుకునేందు తల్లిదండ్రులు అనుమతించే గేమ్ మైన్ క్రాఫ్ట్ ఒక్కటేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న మైన్ క్రాప్ట్ గేమ్ తో పాటు డెవలపర్ మోజాంగ్ ను కూడా కొనుగోలు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మైక్రోసాప్ట్ మోజాంగ్ ను కొనుగోలు చేస్తుందా అంటూ నిద్రలేవగానే తన పదేళ్ల కూతురు వచ్చి అడింగిదని, అంతటి పాపులారిటీ వున్న గేమ్ ను టేకోవర్ చేస్తున్నందుకు సంతోషంగా వుందన్నారు. ఈ గేమ్ విద్యతో పాటు వికాసాన్ని కూడా చిన్నారులకు అందిస్తుందని సత్యనాదేళ్ల పేర్కొన్నారు. బలమైన కమ్యూనిటీ ద్వారా బహిరంగ ప్రపంచ వేదికపై వున్న ఈ గేమ్ పట్ల తమ సంస్థ అతి జాగ్రత్తగా సంరక్షణ చర్యలు చేపడుతుందన్నారు. మరన్ని ఉన్నతమైన కోత్త అవకాశాలతో కమ్యూనిటీ మొప్పు పొందేందుకు కృషి చేస్తామన్నారు.

ఇంతింతై వటుడింతై...

చిన్నపాటి గేమ్ లను డిజైన్ చేసి.. పిల్లలు అడేందుకు వీలుగా రంగంలోకి వచ్చిన స్టాక్ హోమ్స్ డెవలపర్.. అనతి కాలంలో వట వృక్షంగా మారింది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా.. చిన్నపాటి టర్నోవర్ తో ప్రారంభమైన మోజాంగ్ సంస్థ కేవలం 40 మంది ఉద్యోగులతో గత ఏడాది 2.05 బిలియన్ రెవెన్యూను చేజిక్కించుకోగా, అందులో 896 డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2011లో పూర్తిస్థాయిలో గేమ్ విడుదలైనప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ల వినియోగదారులను టార్గెట్ చేసుకున్న ఈ సంస్థ ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles