Arundhati bhattacharya as sbi first woman chairperson

Arundhati Bhattacharya, SBI, State Bank of India, Pratip Chaudhuri, SBI first woman chairperson

The State Bank of India (SBI), has a woman at the top for the first time in its history. But Arundhati Bhattacharya has...

ఎస్ బీ ఐ చైర్ పర్సన్ గా అరుంథతి భట్టాచార్య

Posted: 10/08/2013 05:54 PM IST
Arundhati bhattacharya as sbi first woman chairperson

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషుల్ని మించిపోతున్నారనడానికి ఇదో నిదర్శనం. దాదాపు 204 సంవత్సరాల చరిత్ర గలిగిన ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు తొలి మహిళా ఛైర్ పర్సన్ గా అరుంధతీ భట్టాచార్య నియమితులు అయ్యారు.  ఇన్ని వందల ఏళ్ళ చరిత్రలో ఇంత పెద్ద బ్యాంకుకు  ఓ మహిళా బ్యాంకు పగ్గాలను చేపట్టడం విశేషం, ప్రథమం. 1977లో ప్రొబేషనరీ బ్యాంక్ ఆఫీసర్ గా ఎస్ బీఐలో చేరిన అరుంథతి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) , ఛీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) గా బాద్యతలు నిర్వర్తిస్తున్నారు.

గత నెల సెప్టెంబర్ 30వ తారీఖున ప్రతీవ్ చౌధురి పదవి విరమణ చేయడంతో ఈమెకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. ప్రస్తుతం పలు ప్రభుత్వ రంగ భ్యాంకులు అయిన అలహాబాద్ బ్యాంక్ (సుబ్బలక్ష్మీ పాన్సే), బ్యాంక్ ఆప్ ఇండియా (వి.ఆర్. అయ్యర్) ప్రైవేటు రంగ బ్యాంకులు అయిన ఐసీఐసీఐ కి (చందా కొచ్చర్ ), యాక్సిస్ బ్యాంక్ కి (శిఖా శర్మ) హెచ్ డిఎఫ్ సి (నైనా లాల్ క్విదాయ్) ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు వారి సరసన అరుంథతీ భట్టాచార్య వచ్చి చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles