Andhra bank shares slump

andhra bank, shares slump, NPA, provisioning, bad loans, net income, bse

Provisioning for bad loans rose to `150 cr from `39.5 cr in year-ago quarter; profit fell to `257 crore from `303.17 cr

Andhra Bank shares slump.png

Posted: 01/25/2013 07:29 PM IST
Andhra bank shares slump

Andhra_Bankప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 15 శాతం క్షీణించడానికి తోడు భారీగా పెరుగుతున్న నిరర్థక ఆస్తులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అక్టోబర్-డిసెంబర్ మూడు నెలల కాలానికి ఆంధ్రాబ్యాంక్ నికరలాభం 15 శాతం క్షీణించి రూ.257 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి బ్యాంకు నికరలాభం రూ.303 కోట్లుగా ఉంది. సమీక్షా కాలానికి వడ్డీ ఆదాయం 10 శాతం పెరిగి రూ.2,923 కోట్ల నుంచి రూ.3,231 కోట్లకు చేరింది. ఈ మూడు నెలల కాలంలో కొత్తగా రూ.288 కోట్ల రుణాలను ఆంధ్రాబ్యాంక్ నిరర్థక ఆస్తులుగా ప్రకటించింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు ఇచ్చిన రుణం, గతంలో పునర్‌వ్యవస్థీకరించిన రుణం మొండి బకాయిలుగా మారడంతో నిరర్థక ఆస్తులు పెరగడానికి ప్రధాన కారణమని ఆంధ్రాబ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బి.ఎ.ప్రభాకర్ గురువారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. ద్వితీయ త్రైమాసిక ఫలితాల సందర్భంగా డీసీహెచ్‌ఎల్‌కు రూ.200 కోట్ల రుణం ఇచ్చినట్లు ప్రభాకర్ తెలియచేసిన సంగతి విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rbi slashes repo rate
Deccan chronicle posts rs1040 cr loss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles