Sbi branches may stay open on sundays

SBI branches may stay open on Sundays,State Bank of India, Pratip Chaudhuri, Edelweiss Securities

SBI branches may stay open on Sundays

SBI.gif

Posted: 08/27/2012 10:37 AM IST
Sbi branches may stay open on sundays

SBI branches may stay open on Sundays

ఆదివారం అంటే  అందరికి సెలవ్ అనే మాట గుర్తుకు వస్తుంది. అయితే  ఇప్పుడు ఒక బ్యాంకు కొత్త పథకం మొదలు పెట్టింది.  ఆదివారము  పని చేస్తే  ఏమవుతుంది?  అనే ఆలోచనలో  పడింది.  స్టేట్ బ్యాండ్ ఆఫ్ ఇండియా  సామర్థ్యాన్ని  మెరుగుపర్చుకొనే  పనిలో  భాగంగా ఆదివారాల్లోనూ శాఖలను  తెరచి ఉంచాలనే  ఆలోచన  చేస్తోంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు  అందుబాటులో  ఉంచడానికి , వ్యాపారాన్ని  పెంచుకోవడానికి  ఆదివారాల్లో  బ్యాంకులు  పనిచేయాలని  అనుకుంటున్నట్లు  బ్యాంకు  చైర్మన్  ప్రతీవ్  చౌధరి  పేర్కొన్నారు.  ఎడెల్ వీజ్  సెక్యూరిటీస్  నిర్వహించిన  ఒక కాన్పరెన్స్  కాల్ లో  విశ్లేషకులతో  మాట్లాడుతూ  ఆయన ఈ విషయాన్ని  వెల్లడించారు.  ప్రస్తుతం  అధికారులు  నిర్వహిస్తున్న  రోజువారి బాధ్యతలను  జూనియర్  ఉద్యోగులకు నేర్పించే  ప్రయత్నమూ చేయనున్నట్లు  చౌధురి  తెలిపారు. గత ఏడాది అక్టోబరు 2న ( జాతీయ సెలవు దినం, ఆదివారం)  అన్ని శాఖలను  ఎస్ బీ ఐ  తెరిచి ఉంచి ఆశ్చర్యపరచిన  సంగతి  తెలిసిందే. ఒక రోజు సాంకేతిక  సమస్య కారణంగా వచ్చిన వ్యాపార నష్టాన్ని  పూడ్చుకునేందుకు  ఆ పని చేసింది.  ఆ రోజు వచ్చిన స్పందనతో  బ్యాంకు  ఆనందపడినట్లు  తెలుస్తోంది.  అంతర్జాతీయ ( ఇంటర్ నెట్ )  ఆదారిత బ్యాంకింగ్ రంగప్రవేశం  చేశాక  కూడా అనేక ప్రైవేటు బ్యాంకులు  ఇప్పటికే  వినియోగదారుల  సౌకర్యాన్ని మనసులో పెట్టుకొని ఎంపిక చేసిన శాఖలను  ఆదివారం  సైతం తెరిచి ఉంచుతుండడం  గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Direct flights from visakhapatnam
Gold price hits record in india track overseas mkts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles