The Historical Story Of Kondaveedu Fort Which Is Built Reddy Kings Dynasty | Guntur City History | Historical Places

Kondaveedu fort historical place guntur city history

Kondaveedu Fort history, Kondaveedu Fort photos, Kondaveedu Fort historical stories, guntur city history, guntur city fort, reddy kings dynasty

Kondaveedu Fort Historical Place Guntur City History : The Historical Story Of Kondaveedu Fort Which Is Built Reddy Kings Dynasty.

గుంటూరు నగర చరిత్రలో భాగమైన కొండవీడు కోట

Posted: 09/18/2015 05:51 PM IST
Kondaveedu fort historical place guntur city history

కోండవీడు కోట.. గుంటూరు నగరానికి చెందిన చరిత్రలో భాగమైన అద్భుతమైన నిర్మాణం. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో నిర్మించబడిన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన కొండవీడు గ్రామంలో ఈ కోట వుంది. ఈ ఫోర్ట్ లో 21 నిర్మాణాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలు చాలా శాతం శిధిలం అయినప్పతికి ఈ కోట రహస్యాల గురించి చెప్పకనే చెపుతాయి. ఈ ఫోర్ట్ సుందర ప్రదేశ అందాలను చూసి ఆనందించటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. అంతే కాక ఈ ప్రదేశం ట్రెక్కింగ్ ఇంకా హైకింగ్ కి అనువుగా ఉంటుంది. గోపినాథ టెంపుల్ మరియు కతులబవే టెంపుల్ ఈ ఫోర్ట్ కి చాల ఈ దగ్గరగా ఉన్న దేవాలయాలు. ఈ కోట నివాస సౌధాలు ఇంకా ఇక్కడి పెద్ద హాలు కుడా ఈ ప్రదేశ చరిత్రకి సాక్షాలు గా అనిపిస్తాయి.

కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది. కొండవీడు కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జి.ఒ.1535 తేదీ 2-11-1966న నిర్ణయించారు. ఇక్కడో కందకం (అగడ్త) ఉండేది. 37 ఎకరాల విస్తీర్ణం గల ఈ కందకానికి చారిత్రక కొండవీటికొండ మీద నుంచి వర్షాకాలంలో నీరు జాలువారుతుంది. కందకంలోకి చేరిన నీటిని కొండవీడు పరిసరాల్లోని ఐదు గ్రామాల భూముల రైతులు సాగునీరుకు వినియోగించుకుంటున్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవటంతో కందకం అడవి మాదిరిగా తయారైంది. భూగర్భ జలాల పెరుగుదలకు ఉపయోగపడుతుందని అధికారులు నివేదికలు రూపొందించారు. 20 సెంట్ల కందకం ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించి రూపురేఖలు మార్చారు. ఎనిమిది అడుగుల లోతు గల కందకాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు, మట్టితో పూడ్చి వేసి చదునుచేశారు. కందకం పరిధిలో ఒకటి రెండు చోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

కొండవీడు కోట పరిధిలో అత్యంత గుర్తింపు కలిగిన ప్రాంతం కత్తులబావి. దీన్నే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో చారిత్రక నిర్మాణాల తొలగింపునకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని కూడా తొలగించారు. గర్భగుడినే కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kondaveedu Fort  Guntur City Dynasty  

Other Articles